ఆర్థిక బకాయిలు చెల్లించండి

Jan 19,2024 22:10
ఆర్థిక బకాయిలు చెల్లించండి

ప్రజాశక్తి – శ్రీకాళహస్తి, యంత్రాంగం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. శ్రీకాళహస్తి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద యూటీఎఫ్‌ నాయకులు శుక్రవారం నిరసన తెలిపారు. యుటిఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి సూర్య ప్రకాష్‌ మాట్లాడుతూ 12వ పిఆర్సి విధి విధానాలు నిర్ణయించక ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తొందని మండిపడ్డారు. నివేదిక వచ్చేంతవరకు 30 శాతం ఇంటీరియర్‌ రిలీఫ్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏళ్ల తరబడి అపరిస్కతంగా ఉన్న సరెండర్‌ లీవులు, ఎన్‌ క్యాష్‌ మెంట్‌ బకాయిలను ఇవ్వాలని కోరారు. మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బిల్లు, పెన్షనర్ల ఫైనల్‌ పేమెంట్లు చెల్లించాలనీ, పిఎఫ్‌ సైట్‌ ను వెంటనే పునరుద్ధరించాలనీ, పిఎఫ్‌ కి సంబంధించి చందాలు, వడ్డీలు, సకాలంలో చెల్లించేలా, పిఆర్సిడిఎ అరియర్స్‌ ను జమ చేయాలని సూచించారు. కె.మోహన్‌ బాబు, సి వెంకట కష్ణ, ఓ విజరు కుమార్‌ పాల్గొన్నారు.- గూడూరు టౌన్‌లో మండల విద్యావనరుల కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. తిరుపతి జిల్లా కార్యదర్శి జి.సుధీర్‌, రవి,నాగేశ్వరరావు, మురళిసింగ్‌ పాల్గొన్నారు. – సూళ్లూరుపేటలో తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండల శాఖలఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. శనివారం అన్ని తాలూకాకేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. – వెంకటగిరిలో ఎంఇఒ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కె.ఉదరుకుమార్‌, వెంకటగిరి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగదీశ్వరి, ఆదినారాయణ, సుబ్రమణ్యం, డక్కిలి నాయకులు గంగారావు, వెంకటేశ్వర్లు, బాలాయపల్లి నాయకులు రత్నశేఖర్‌, వాణిశ్రీ, కరుణ పాల్గొన్నారు. – పుత్తూరులో నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. శేఖర్‌, గీతమ్మ, కొలత్తూరు భాస్కర్‌ పాల్గొన్నారు. – తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. యుటిఎఫ్‌ జిల్లాప్రధాన కార్యదర్శి కె.ముత్యాలరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవరాల నిర్మల, జిల్లాకోశాధికారి పత్తిపాటి రమేష్‌నాయుడు, జిల్లా కార్యదర్శులు దండు రామచంద్రయ్య, అవనిగడ్డ పద్మజ, శేఖర్‌ పాల్గొన్నారు.

➡️