ఆశావాహులకు చోటువివాదాస్పద స్థానాలకు బ్రేక్‌చిత్తూరులో 5, తిరుపతిలో 2టిడిపి తొలిజాబితా ప్రకటన

ఆశావాహులకు చోటువివాదాస్పద స్థానాలకు బ్రేక్‌చిత్తూరులో 5, తిరుపతిలో 2టిడిపి తొలిజాబితా ప్రకటన

ఆశావాహులకు చోటువివాదాస్పద స్థానాలకు బ్రేక్‌చిత్తూరులో 5, తిరుపతిలో 2టిడిపి తొలిజాబితా ప్రకటనప్రజాశక్తి – తిరుపతి బ్యూరో టిడిపిలో ఆశావాహులకు చోటు దక్కింది.. వివాదాస్పద స్థానాలకు బ్రేక్‌ పడింది. జనసేన, టిడిపి ఉమ్మడి పొత్తుతో సార్వత్రిక ఎన్నికల్లో ముందుకెళుతోంది. విజయవాడలో చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ ప్రకటించిన తొలి జాబితాలో చిత్తూరు జిల్లాలో ఐదుగురిని, తిరుపతిలో ఇద్దరిని ఖరారు చేశారు. చిత్తూరులో గురజాల జగన్మోహన్‌, నగిరి గాలి భానుప్రకాష్‌, జీడీనెల్లూరు డాక్టర్‌ థామస్‌, పలమనేరు అమరనాథరెడ్డి, కుప్పం నారా చంద్రబాబునాయుడు బరిలో ఉండనున్నారు. చిత్తూరులో పూతలపట్టు, పుంగనూరు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పుంగనూరులో టిడిపి తరపున చల్లా రామచంద్రారెడ్డి పోటీలోఉన్నప్పటికీ కొత్తగా పార్టీ పెట్టిన రామచంద్రయాదవ్‌ పొత్తులో భాగంగా పుంగనూరు అడుగుతున్నట్లు సమాచారం. పూతలపట్టులో జరిగిన బహిరంగసభలో కలికిరి మురళీమోహన్‌ను ఆదరించాలని పిలుపున్చినా తొలి జాబితాలో పేరు లేకపోవడం గమనార్హం. తిరుపతి జిల్లాలో గూడూరు పాశం సునీల్‌కుమార్‌, సూళ్లూరుపేట నెలవల విజయశ్రీలను ప్రకటించారు. సత్యవేడు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఇంకా ప్రకటించలేదు. తిరుపతి జనసేనతో పొత్తులో భాగంగానే పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రగిరి, సత్యవేడులో అనిశ్చిత పరిస్థితి ఉంది. శ్రీకాళహస్తిలోనూ జనసేన అభ్యర్థి పట్టుబడుతున్నట్లు సమాచారం. వెంకటగిరిలో ఎస్సీవీ నాయుడు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

➡️