ఆశా కార్యకర్తల జిల్లా కమిటీ ఎన్నిక

ఆశా కార్యకర్తల జిల్లా కమిటీ ఎన్నిక

ఆశా కార్యకర్తల జిల్లా కమిటీ ఎన్నికప్రజాశక్తి- తిరుపతి సిటి: ఆశా కార్యకర్తల జిల్లా నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిఐటియు జిల్లా నాయకురాలు ఆర్‌.లక్ష్మీ అధ్యక్షతన శనివారం జిల్లాలోని ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షురాలుగా ఎం.కవిత, ప్రధాన కార్యదర్శిగా పి.లక్ష్మీ, కోశాధికారిగా వి.సుజాతను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించాలని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు టి.మురళీ, పి.మునిరాజా, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️