ఆస్టర్‌ నారాయణద్రిలో అరుదైన శస్త్రచికిత్స

Dec 23,2023 22:11
ఆస్టర్‌ నారాయణద్రిలో అరుదైన శస్త్రచికిత్స

ప్రజాశక్తి -తిరుపతి సిటీ ఆస్టర్‌ నారాయణాద్రి ఆసుపత్రిలోని ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం నందు అరుదైన శాస్త్ర చికిత్స నిర్వహించినట్టు సి ఓ ఓ శ్రీధర్‌ తెలిపారు. స్థానిక రేణిగుంట రోడ్డు లోని ఆసుపత్రి వద్ద వైద్య బందంతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బోయకొండకు చెందిన ధనలక్ష్మి ఆవులు మేపుకుంటూ జీవనం సాగిస్తుండేది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వారి ఎద్దు ఆమెని ఎడమ కాలు తొడ భాగంలో గట్టిగా పొడిచింది. దీంతో తీవ్ర రక్తస్రావం మై కింద పడింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ వైద్యుల సూచన మేరకు తిరుపతి ఆస్టర్‌ నారాయణాద్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల ఆమెని పరిశీలించి, కాలికి రక్తప్రసరణ జరగకపోవడం వల్ల పూర్తిగా చచ్చుబడిపోయిందని తెలిపారు. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాధిపతి డాక్టర్‌ విజయకుమార్‌ రెడ్డి ఆమెను పరిశీలించి, వెనువెంటనే ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లి ప్లాస్టిక్‌ సర్జరీ ద్వారా కత్తిమ రక్తనాళాలను అమర్చి, ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. అరుదైన శాస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన వైద్య బందాన్ని సి ఓ ఓ అభినందించారు. బాధితురాలు కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

➡️