ఎంపీ ఎన్నికను రద్దు చేయాలి: రజనీకాంత్‌

ఎంపీ ఎన్నికను రద్దు చేయాలి: రజనీకాంత్‌

ఎంపీ ఎన్నికను రద్దు చేయాలి: రజనీకాంత్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)2021లో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు నమోదు జరిగిందని, దొంగ ఓట్లను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులపై చర్యలకు ఉపక్రమించిన తరుణంలో ఎంపీగా ఎన్నికైన గురుమూర్తి ఎన్నికను రద్దు చేయాలని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. శనివారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హాయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గా, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ గా విధులు నిర్వహించిన ఐఏఎస్‌ అధికారి గిరీషా ఉత్తమ అధికారిగా పేరు తెచ్చుకున్నారని అలాంటి అధికారిని నేడు అధికార దాహంతో ఒత్తిళ్లకు గురిచేసి దొంగ ఓట్లు నమోదు చేయించి నేడు సమాజంలో దోషిగా నిలబెట్టారని, ఎవరైతే అధికారులను ఒత్తిళ్లకు గురిచేసి దొంగ ఓట్లు నమోదు చేయించారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 2024లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో విచారణ కమిటీ వేయించి దొంగ ఓట్లకు బాధ్యులైన వారిని సమాజం ముందు నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌ యాదవ్‌, దినేష్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️