ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనప్రభుత్వ కాంటాక్ట్‌ ఉద్యోగులపై వేటు

Mar 20,2024 00:12

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనప్రభుత్వ కాంటాక్ట్‌ ఉద్యోగులపై వేటుప్రజాశక్తి- గుడిపల్లి: ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ గుడిపల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌, కుప్పం టెక్నికల్‌ అసిస్టెంట్లను విధుల నుండి తొలగిస్తూ చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా ఉంటూ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన కారణంగా చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం చీకటపల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఎం.వెంకటేష్‌, కుప్పం మండలం టెక్నికల్‌ అసిస్టెంట్‌ జి.మురగేష్‌లను విధుల నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.గుడిపల్లి మండలం చీకటిపల్లి గ్రామపచాయతీకి చెందిన ఎం.వెంకటేష్‌ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇతను వైసిపి పార్టీ కార్యకలాపాల్లో ప్రచారంలో యథేచ్ఛగా పాల్గొనడంతో అతనిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందడంతో విధుల నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు ఉపాధి హామీ కార్యాలయానికి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రామకుప్పం మండలానికి చెందిన మురుగేశ్‌ కుప్పం మండలంలో టీఏగా పనిచేస్తున్నారు. అతను డిప్యూటేషన్పై వైసిపి ఎమ్మెల్సీ భరత్‌ పీఏగా పనిచేస్తున్నారు. కుప్పం రెవెన్యూ కార్యాలయంలో సోమవారం అఖిలపక్ష నాయకులతో ఆర్వో, ఆర్డీవో శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా టిడిపి, బిజెపి, కాంగ్రెస్‌, జనసేన తరపున నాయకులు పాల్గొనగా.. అధికార వైసిపి తరపున ఎమ్మెల్సీ పీఏ మురుగేశ్‌ పాల్గొనడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు గాను మురగేష్‌ను విధుల నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

➡️