ఎన్నికల వేళా… ‘పన్ను’పోటు5శాతం ఆస్తిపన్ను పెంపుకు సన్నాహాలుఇంటిపన్నుతో కలిపి వసూలుకు నిర్ణయండిమాండ్‌ నోటీసులు సిద్ధం చేసిన కార్పొరేషన్‌పార్కింగ్‌ ఛార్జీల వసూళ్లకూ ప్రణాళిక సిద్ధం

ఎన్నికల వేళా... 'పన్ను'పోటు5శాతం ఆస్తిపన్ను పెంపుకు సన్నాహాలుఇంటిపన్నుతో కలిపి వసూలుకు నిర్ణయండిమాండ్‌ నోటీసులు సిద్ధం చేసిన కార్పొరేషన్‌పార్కింగ్‌ ఛార్జీల వసూళ్లకూ ప్రణాళిక సిద్ధం

ఎన్నికల వేళా… ‘పన్ను’పోటు5శాతం ఆస్తిపన్ను పెంపుకు సన్నాహాలుఇంటిపన్నుతో కలిపి వసూలుకు నిర్ణయండిమాండ్‌ నోటీసులు సిద్ధం చేసిన కార్పొరేషన్‌పార్కింగ్‌ ఛార్జీల వసూళ్లకూ ప్రణాళిక సిద్ధంప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నగరవాసులపై పన్నుల భారం మోపుతూనే ఉంది.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రజలపై కురిపించిన ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందన్న విమర్శలు మూటగడుతూనే ‘పన్ను’ పోటు పెంచుతోంది. తాజాగా రాష్ట్ర ఆర్థిక సంఘం ఆదేశాల మేరకు ఆస్తిపన్ను చెల్లించేవారిపై ఐదు శాతం అంటే దాదాపు మూడు కోట్లకు పైగా అదనపు భారాన్ని మోపడానికి రంగం సిద్ధమయ్యింది. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్‌ ఛార్జీలు వసూలు చేయడానికి ఆర్థికసంఘం సిఫార్సు చేయడంతో ఇకపై ఎక్కడికక్కడ పార్కింగ్‌ ప్రాంతాలను గుర్తించి వాహన చోదకుల నుంచి ఛార్జీలను వసూలు చేయనుంది. తద్వారా మరో రెండు కోట్ల ఆదాయం కార్పొరేషన్‌కు రానుంది. వసూలైన నిధుల్లో కనీసం 20శాతం కూడా నగరాభివృద్ధికి వెచ్చించకుండా నిధులు వేరే వాటికి మళ్లిస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఏప్రిల్‌ నుంచి డిమాండ్‌ నోటిసులో అదనపు ఆస్తిపన్ను కలిపి ఇవ్వనున్నారు. ఇదే గనుక జరిగితే అద్దెకుండే వారిపైనా ఆటోమేటిగ్గా భారం పడనుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వార్షిక అద్దె విలువ మూలధన విలువ ఆధారిత ఆస్తిపన్ను విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మార్కెట్లో భూమి విలువ, భవనం విలువలో 0.13 శాతాన్ని ఆస్తిపన్నుగా నిర్ణయించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో భారమంతా ఒకేసారి పడకుండా ఏటా 15శాతం పెంచుకునేలా ప్రతిపాదించారు. తిరుపతి నగరపాలక సంస్థకు ఆస్తిపన్నుల రూపంలో ఏడాదికి ప్రభుత్వ, ప్రైవేట్‌ భవనాలు కలిపి దాదాపు రూ.60 కోట్ల ఆదాయం వస్తుంది. మరో ఐదుశాతమంటే దాదాపు రూ.3 కోట్ల వరకూ భారం పడనుంది. యూజర్‌ఛార్జీల మోత రాష్ట్ర ప్రభుత్వం 2020 నుంచి యూజర్‌ ఛార్జీల వసూళ్లు మొదలు పెట్టింది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కొన్నిచోట్ల మురికివాడలను మినహాయించింది. 50 డివిజన్లున్న తిరుపతిలో మూడు లక్షల జనాభా ఉంది. 65వేలకు పైగా ఇళ్లున్నాయి. యూజర్‌ఛార్జీల కింద ప్రతి ఇంటికి రూ.40, అపార్టుమెంట్‌వాసులకు రూ.50-100 చొప్పున చెత్తపన్ను వసూలు చేస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో చెత్తపై నెలకు రూ.50 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా, కేవలం 25-30 లక్షలు మాత్రమే వసూలు చేస్తోంది. యూజర్‌ఛార్జీల పేరుతో నెలకు రూ.70 నుంచి కోటి రూపాయలు చేయాలన్న లక్ష్యం ఉంది.

➡️