ఎస్‌వియూను సందర్శించిన ఎన్‌సిపియుఎల్‌

ఎస్‌వియూను సందర్శించిన ఎన్‌సిపియుఎల్‌

ఎస్‌వియూను సందర్శించిన ఎన్‌సిపియుఎల్‌ప్రజాశక్తి -తిరుపతి సిటీ: న్యూఢిల్లీకి చెందిన నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఫర్‌ ఆఫ్‌ ఉర్దూ లాంగ్వేజ్‌ ఉర్దూ ప్రచార గ్రంథాలయ వాహనం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని బుధవారం సందర్శిం చింది. ఈ సందర్భంగా వర్సిటీకి చేరుకున్న ప్రచార వాహనాన్ని ఉర్దూ విభాగం అధిపతి డాక్టర్‌ నిషారహ్మద్‌ ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పుస్తకాలు విజ్ఞానాన్ని పెంపొంది స్తాయని, గ్రంథాలయాలు నిజమైన నేస్తాలని వెల్లడిం చారు. విద్యార్థులకు పుస్తకాలు ఎంతో ఉపయోగ పడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఊర్దూ బాస వికాసానికి కషి చేస్తూ ఈ వాహనాన్ని ప్రారం భించడం అభినందనీయమన్నారు. ఈ వాహనాన్ని అన్ని రాష్ట్రాలకు సంచార గ్రంథాలయాలుగా పంపిస్తున్నందుకు కతజ్ఞతలు తెలిపారు. ఈ ఉర్దూ వాహనంలో వున్న ఉర్దూ చరిత్ర, విద్యా, సాహిత్య, సంస్కతి, పరిశోధన గ్రంథాలను వేలాది మంది విద్యార్థులు, పరిశోధకులు, ఆచార్యులు సందర్శించి పుస్తకాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆచార్యులు పాల్గొన్నారు.

➡️