ఎస్వీయూ వీసీ శ్రీకాంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఎస్వీయూ వీసీ శ్రీకాంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ఎస్వీయూ వీసీ శ్రీకాంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరణప్రజాశక్తి – క్యాంపస్‌ (ఎస్వీయూ)రాయలసీమ సిగలో మరకతమణిలాంటి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి సరికొత్త ఉపకులపతిగా నియమితులైన డా. వంగిమళ్ల శ్రీకాంత్‌ రెడ్డి గురువారం ఉదయం విసి చాంబర్లో 9.45 గంటలకు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి ఉప కులపతి పదవీ బాధ్యతలు ప్రస్తుత విసికి అప్పజెప్పాల్సిన ప్రోటోకాల్‌ ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆమె రాకపోవడంతో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య హుస్సేన్‌ ఇన్చార్జి విసి ఆచార్య సుందరవల్లి స్థానంలో డాక్టర్‌ వంగిమల్ల శ్రీకాంత్‌ రెడ్డికి నూతన ఉపకులపతిగా బాధ్యతలు అప్పగించారు. తొలుత విశ్వవిద్యాలయంలోని మహాత్మాగాంధీ, డా. బిఆర్‌ అంబేద్కర్‌ , నీలం సంజీవరెడ్డి , టంగుటూరి ప్రకాశం పంతులు , గోవిందరాజులు నాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్వీయూ మాజీ ఉపకులపతి ఆచార్య ప్రభాకరరావు ,శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విసి ఆచార్య భారతి, రిజిస్ట్రార్‌ ఆచార్య రజనిలు ఎస్వీయూ వైస్‌ ఛాన్సలర్‌ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ పాలకమండలి సభ్యులు ఆచార్య భూమన సుగుణమ్మ, ఆచార్య పద్మనాభం, ఆచార్య సుమకిరణ్‌ ,డా. మంజుల, డా. నారాయణ బాబు, డా. సురేంద్రనాథ్‌ రెడ్డి, జ్యోతి, రిజిస్ట్రార్‌ మహమ్మద్‌ హుస్సేన్‌ , పరిశోధకులు డాక్టర్‌ జనార్ధన్‌రెడ్డి, డాక్టర్‌ సుందర్‌ రాజారెడ్డి, డాక్టర్‌ అజ్జుగుంటి సుదర్శన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.- పుత్తూరు టౌన్‌లో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే దీక్ష కొనసాగించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం డిప్యూటీ సిఎం నారాయణస్వామి ఇంటిని గురువారం ముట్టడించారు. అంగన్‌వాడీలను బెదిరించడం ఆపి, చేతనైతే అంగన్‌వాడీల జీతాలు పెంచుతూ జీవో ఇవ్వాలని డిమాండ్‌చేశారు. అనంతరం ఎస్‌ఐ గౌరీశంకర్‌కు వినతిపత్రం అందజేశారు. – నాయుడుపేటలో సిఐటియు నాయకులు శివకవి ముకుంద, అంగన్‌వాడీ నాయకులు సంధ్య, కళావతి, మేరి, ప్రమీల, నాగమ్మ, మునిరత్నమ్మ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.- కోటలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఎం చిరునామాతో లెటర్లు రాసి మండల అధ్యక్షురాలు పద్మలీలమ్మ ఆధ్వర్యంలో పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో సుందరమ్మ, రాధ, సరోజినీ పాల్గొన్నారు. – పిచ్చాటూరులో అంగన్‌వాడీల సమ్మెకు సత్యవేడు నియోజకవర్గ టిడిపి మాజీ ఎంఎల్‌ఎ హేమలత మద్దతు తెలిపారు. మాజీ ఎఎంసి ఛైర్మన్‌ డి.ఇలంగోవన్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️