కళ్లకు నల్లరిబ్బన్ల కట్టుకుని నిరసన

కళ్లకు నల్లరిబ్బన్ల కట్టుకుని నిరసన

కళ్లకు నల్లరిబ్బన్ల కట్టుకుని నిరసనప్రజాశక్తి – క్యాంపస్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద సేవలు కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం నల్ల రిబ్బనలతో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. నిరసనకు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పి.సాయిలక్ష్మి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌ మద్దతు తెలిపారు. ఈసందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌.జయచంద్ర, మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి, సమాన వేతనం అమలు చేయాలి బేసిక్‌ పే, డిఏ, సిసిఏతో కూడిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అగ్రికల్చర్‌ పరిధిలోని రీసెర్చ్‌ స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు లేబర్‌ వివరాలను రీసెర్చ్‌ స్టేషన్‌లో నమోదు చేయాలని, వారిని టైంస్కేల్‌ వర్కర్లకు గుర్తించాలని కోరారు. అగ్రికల్చర్‌ పరిధిలోని వివిధ రీసెర్చ్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న కాంటాక్ట్‌ లేబర్‌ను ఔట్సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేర్చాలన్నారు. కాంట్రాక్ట్‌ లేబర్‌కు సంవత్సరం మొత్తం పనిచూపించాలని డిమాండ్‌ చేశారు. ఆఫీసులలో పనిచేస్తున్న స్లీపర్‌, అటెండర్‌ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్‌ కార్మికులకు ఇస్తున్న ప్రమాద సహజ మరణ నష్టపరిహారం కూడా ఇవ్వాలి కార్మికశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాంట్రాక్టు లేబర్‌కు జాతీయ పండుగ సెలవులు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇవన్నీ ప్రభుత్వం అమలు చేయకుండా పోతే పెద్దఎత్తున పోరాటాన్ని ఉదతం చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. యూనియన్‌ నాయకులు వరలక్ష్మి, రాకేష్‌, చంద్రమ్మ, సుబ్బు, మునిలక్ష్మి, రాధా, రేవతి, తదితరులు పాల్గొన్నారు.

➡️