గంగాధర్‌పై ఫోక్సో కేసు నమోదుమలుపు తిరిగిన విద్యార్థి ఆత్మహత్య కేసు

గంగాధర్‌పై ఫోక్సో కేసు నమోదుమలుపు తిరిగిన విద్యార్థి ఆత్మహత్య కేసుప్రజాశక్తి -తిరుపతి సిటీ విద్యార్థి ప్రశాంతి ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. నమ్మిన వ్యక్తి ప్రేమించి గర్భవతిని చేయడంతో జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడయ్యింది. పోలీసుల కథనం మేరకు… గత నెల నారాయణ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రశాంతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఈస్ట్‌ పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేశారు. విద్యార్థి ఆత్మహత్యను అనుమానించిన కుటుంబ సభ్యులు ఆ విద్యార్థి పుస్తకాలను పరిశీలించారు. పుస్తకాలలో సూసైడ్‌ నోట్‌ బయట పడింది. మతి చెందిన విద్యార్థి అప్పటికే గర్భవతని బహిర్గతమైంది. విచారణ చేపట్టిన ఈస్ట్‌ డి.ఎస్‌.పి విద్యార్థి మతికి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఎ.గంగాధర్‌ బాధ్యుడని తేల్చారు. ప్రశాంతి పట్ల గంగాధర్‌ వ్యవహరించిన తీరును జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. మతురాలి తల్లి ఫిర్యాదు తో నిందితుడి పై ఈస్ట్‌ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు గంగాధర్‌ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు.

➡️