గర్భిణీని చేతులపై మోస్తూ వాగు దాటించిన గ్రామస్తులు

గర్భిణీని చేతులపై మోస్తూ వాగు దాటించిన గ్రామస్తులుకలెక్టర్‌

గర్భిణీని చేతులపై మోస్తూ వాగు దాటించిన గ్రామస్తులుకలెక్టర్‌ ..ప్రజాశక్తి -నాగలాపురం తిరుపతి జిల్లా నాగలాపురం మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని కొట్టకాడు గ్రామంలో ప్రతిభ అనే యువతికి పురిటినొప్పులు వచ్చాయి. అయితే తీవ్ర వర్ష ప్రభావంతో ఎక్కడికక్కడ దారులు మూసుకుపోయాయి. దీంతో గ్రామస్థులు, కుటుంబీకులు ఆమెను చేతులతో మోసుకుని తాళ్ల సాయంతో వాగుని దాటించిన హదయవిదారక ఘటన సోమవారం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితమే స్వయానా కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి అధికారులను అప్రమత్తం చేస్తూ పది రోజుల్లో డెలివరీ అయ్యే గర్భిణీలను దగ్గరలోని ఆస్పత్రులకు చేర్చాలని ఆదేశాలు జారీ చేసినా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వివరాలిలా ఉన్నాయి. కుంభవర్షం కురిసిందంటే కొట్టకాడు గ్రామానికి రాకపోకలు ‘బంద్‌’ అవుతాయి.. గత మూడు రోజులుగా కురుస్తున్న తుపాను ప్రభావంతో కొట్టకాడు గ్రామానికి వెళ్లే వాగు పొంగిపొర్లుతోంది.. అయితే అదే గ్రామంలోని ప్రతిభ (21)కు ఉన్నట్టుండి పురిటినొప్పులు రావడంతో భర్త వెంకటేష్‌ (24)కు దిక్కుతోచలేదు. గ్రామస్తుల సాయంతో 108కు ఫోన్‌చేసినా స్పందన లేకపోవడంతో వాగు వరకూ ఆటోలో గర్భిణీని తీసుకొచ్చారు. గ్రామస్తులు చుట్టూ ఆమెకు రక్షణగా ఉండి చేతుల సాయంతో గర్భిణీని మోస్తూ తాళ్ల సాయంతో వాగును దాటించారు. అక్కడనుంచి మరో ఆటోలో నాగలాపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే నొప్పులు వచ్చాయని, డెలివరీకి ఇంకా రెండు రోజులు సమయం ఉందని వైద్యులు తెలిపారు.

➡️