గుండెపోటుతో వాలంటీర్‌ మృతి

గుండెపోటుతో వాలంటీర్‌ మృతి

గుండెపోటుతో వాలంటీర్‌ మృతిప్రజాశక్తి- కేవిబి పురంమండలంలోని సదాశివపురం గ్రామ పంచాయతీకి చెందిన వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన వాలంటీర్‌ బత్తల రవి కుమార్‌(32) శనివారం హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ రవి కుమార్‌ వాలంటీర్‌ ప్రజలకు, సచివాలయానికి మధ్య వారధిగా పనిచేశారని అన్నారు. సిఐటియు మండల కార్యదర్శి నాగలాపురం నాగరాజు మాట్లాడుతూ రవికుమార్‌ పేద కుటుంబానికి చెందిన వాడని, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

➡️