గోడ కూలి ఇద్దరి భవన నిర్మాణ కార్మికుల మృతి

గోడ కూలి ఇద్దరి భవన నిర్మాణ కార్మికుల మృతి

గోడ కూలి ఇద్దరి భవన నిర్మాణ కార్మికుల మృతిప్రజాశక్తి – -తిరుపతి (మంగళం): శిథిలావస్థకు చేరిన గోడకూలి ఇద్దరూ భవన నిర్మాణ కార్మికులు మతి చెందిన సంఘటన తిరుపతి నగర పరిధిలోని మంచాల వీధి సమీపంలో చోటుచేసుకుంది. భవన నిర్మాణ కార్మికుల నాయకుడు సుబ్బు యాదవ్‌ కథనం మేరకు గురువారం ఉదయం మంచాల వీధికి సమీపంలోని రాజన్న పార్కు వెనుక వైపు శిథిలావస్థకు చేరిన ఇంటిని కూల్చివేయడానికి మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని సెంట్రల్‌ పార్కు వద్ద కూలీలను మాట్లాడుకుని తీసుకెళ్లారు. ఇంటి పైకప్పుకు ఉన్న రేకులను తొలగించి గోడలను కూల్చే క్రమంలో గోడ ఒక్కసారిగా ముగ్గురు కార్మికులపై పడడంతో సంఘటనా స్థలంలోని భవన నిర్మాణ కార్మికులు నారాయణ, నరసింహులు అక్కడికక్కడే మతి చెందగా మరో కార్మికుడు ఖాదర్‌ బాష తీవ్ర గాయాల పాలయ్యాడు. సంఘటన స్థలం నుండి మతదేహాలను రుయా ఆసుపత్రికి తరలించి, తీవ్ర గాయాల పాలైన ఖాదర్‌ బాషకు చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని వెస్ట్‌ పోలీసులు పరిశీలించి కేసుదర్యాప్తు చేస్తున్నారు.

➡️