ఘనంగా ప్రపంచ సోషల్‌ వర్క్‌డే ప్రారంభం

ఘనంగా ప్రపంచ సోషల్‌ వర్క్‌డే ప్రారంభం

ఘనంగా ప్రపంచ సోషల్‌ వర్క్‌డే ప్రారంభంప్రజాశక్తి – ఎస్‌వియు: ప్రపంచ సోషల్‌ వర్క్‌డేను స్థానియ ఎస్‌వియూనివర్సిటీలో విభాగ అధిపతి ప్రొఫెసర్‌ టి చంద్రశేఖరయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని పాపులేషన్‌ స్టడీస్‌, సోషల్‌ వర్క్‌ విభాగంలో వరల్డ్‌ సోషల్‌ వర్క్‌ దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి పద్మనాభం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పనిచేస్తూ సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని మనిషికి మనిషి తోడుగా ఉండాలని మానవ సంబంధాలను పెంపొందించుకోవాలని సూచించారు. భారతీయ సంస్కతి, సంప్రదాయాలను, జీవన విధానం, అలవాట్లు, సమాజసేవ ప్రాముఖ్యత గురించి వివరించారు. తర్వాత సోషల్‌ వర్క్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ సాయి సుజాత ప్రపంచ సోషల్‌ వర్క్‌ దినోత్సవం ప్రాముఖ్యత, ప్రస్తుత ప్రపంచంలోని సామాజిక సమస్యలు కారణాలు, వాటిని తొలగించు కునేందు కు జాగ్రత్తలు, సోషల్‌ వర్క్‌ విద్యార్థుల పాత్రను వివరించారు. టాటా ట్రస్ట్‌ స్వికార్‌ తిరుపతి ప్రోగ్రాం మేనేజర్‌ హేమంత్‌ కుమార్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌కు సంబంధించిన అంశాల గురించి వివరించారు. అనంతరం వక్తత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వియు క్యాంపస్‌ స్కూల్‌ విద్యార్థులు, ఎస్‌వియు ఐఏఎస్‌ఈ విద్యార్థులు, పాపులేషన్‌ స్టడీస్‌, సోషల్‌ వర్క్‌ విద్యార్థులు, డిపార్టుమెంటు అకడమిక్‌ కన్సల్టెంట్స్‌ కేవీ సునీల్‌ కుమార్‌, ఎం రీనా గెస్ట్‌ ఫ్యాకల్టీ డి కోదండరామిరెడ్డి, పార్థసారథి, శివప్ప, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️