చిందేపల్లి వద్దు..మంగళమే కావాలి..స్థానికంగానే పట్టాలివ్వాలని సిపిఎం ధర్నాపోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తత, అరెస్

చిందేపల్లి వద్దు..మంగళమే కావాలి..స్థానికంగానే పట్టాలివ్వాలని సిపిఎం ధర్నాపోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తత, అరెస్

చిందేపల్లి వద్దు..మంగళమే కావాలి..స్థానికంగానే పట్టాలివ్వాలని సిపిఎం ధర్నాపోలీసుల అత్యుత్సాహంతో ఉద్రిక్తత, అరెస్టుప్రజాశక్తి-తిరుపతి(మంగళం) తిరుపతి శివారు ప్రాంతమైన మంగళం పరిధిలోని పేదలకు ఇచ్చిన జగనన్న ఇంటి పట్టాలకు ఎక్కడో శ్రీకాళహస్తి నియోజకవర్గం చిందేపల్లిలో స్థలాలు వద్దని, స్థానికంగానే చెన్నాయిగుంట సర్వే నెంబర్‌ 195/2లోని 41 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలోనే ఇవ్వాలని సిపిఎం ధర్నా నిర్వహించింది. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆధ్వర్యంలో మంగళం బీటిఆర్‌ కాలనీ నుండి ర్యాలీగా బయల్దేరి చిందేపల్లిలో వద్దు…మంగళంలోనే పట్టాలకు స్థలాలను ఇవ్వాలి’ అంటూ నినాదాలు చేస్తూ తిరుమల నగర్‌ పంచాయతీ సదరు సర్వే నెంబర్‌ గల స్థలం వద్ద నిరసన తెలపడానికి లబ్దిదారులంతా బయల్దేరారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకు అనుమతి లేదని, తిరిగి వెళ్లిపోవాలని సిఐ శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. లబ్దిదారులు ససేమిరా అనడంతో కొంతసేపు తోపులాట చోటు చేసుకుంది. సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు బదులిస్తూ ఎక్కడో సూదుర ప్రాంతమైన చిందెపల్లిలో మంగళంలోని పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వడం భావ్యం కాదని, ఇక్కడే స్థలం ఉన్నా ఎందుకు స్థలాలు లబ్దిదారులకు ఇవ్వరని ప్రశ్నించారు. సర్వే నెంబర్‌ 195/2లో గల 41 ఎకరాల భూమిలో అక్రమంగా మట్టి తోలుకొని కోట్లు వెనకేసిన వారిపై చర్యలు తీసుకోలేని వారు, పేద ప్రజల పోరాటాలకు అడ్డుతగులుతారా అని ప్రశ్నించారు. పోలీసులు ఒక్కసారిగా అరెస్ట్‌ చేయ్యడానికి ప్రయత్నించడంతో కొద్దిసేపు ఉత్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజును లాగడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా మహిళలు అడ్డుకొని పోలీసుల చర్యను ఖండించారు. సిఐ శ్రీకాంత్‌ రెడ్డి మహిళలు అని చూడకుండా దురుసుగా వ్యవహరించడంపై సిపిఎం నాయకులు, ఇళ్ళ పట్టాల లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు లక్ష్మి, జయంతి, రాదాక్రిష్ణ, చల్లా చినవెంకటయ్య, బాదుల్లా, ఇళ్ళ పట్టాల లబ్దిదారులు పాల్గొన్నారు. అరెస్ట్‌ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి… మంగళం తిరుమలనగర్‌ పంచాయతీలోని తుడా క్వార్టర్స్‌ వద్ద ఉన్న స్థలంలోనే జగనన్న ఇళ్ళ పట్టాలకు స్థలాలు చూపాలని, ఈ పోరాటంలో అరెస్ట్‌ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎం.మాధవకృష్ణ, శ్రామిక మహిళా కన్వీనర్‌ ఆర్‌.లక్ష్మి, నగర కమిటీ నాయకురాలు బుజ్జీ, బి.రవి, బి.వెంకటేష్‌లతో సహా 30 మందిని అరెస్టు చేశారు. వీరిని వెంటనే విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కాగా సిపిఎం నాయకులను విడుదల చేయాలని కోరుతూ తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట సిపిఎం నగర కార్యదర్శి టి. సుబమణ్యం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

➡️