జిల్లాలో 17,79,000 మంది ఓటర్లుప్రతి నియోజకవర్గంలో పెరిగిన ఓటర్లుఅత్యధికంగా చంద్రగిరిలో 3 లక్షల 8వేల మందితిరుపతి నియోజకవర్గంలో 2 లక్షల 98 వేల మంది

జిల్లాలో 17,79,000 మంది ఓటర్లుప్రతి నియోజకవర్గంలో పెరిగిన ఓటర్లుఅత్యధికంగా చంద్రగిరిలో 3 లక్షల 8వేల మందితిరుపతి నియోజకవర్గంలో 2 లక్షల 98 వేల మంది

జిల్లాలో 17,79,000 మంది ఓటర్లుప్రతి నియోజకవర్గంలో పెరిగిన ఓటర్లుఅత్యధికంగా చంద్రగిరిలో 3 లక్షల 8వేల మందితిరుపతి నియోజకవర్గంలో 2 లక్షల 98 వేల మందిప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి సోమవారం ప్రకటించారు. గతం కంటే ఈసారి అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సులూరుపేట, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో 3 లక్షల 8 వేల 916 ఓటరులో ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 1,58,607మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 1,50,249 మంది ఓటర్లు ఉన్నారు. 395 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుపతి అసెంబ్లీలో 2,98,239 మంది ఓటర్లు ఉన్నారు. గతం కంటే ఈసారి బాగా ఓటర్ల సంఖ్య పెరిగింది. ఇందులో మహిళా ఓటర్లు 1,50,100 మంది ఓటర్లు కలిగి ఉన్నారు. పురుషులు 1,48,101 మంది ఓటర్లు కలిగి ఉన్నారు. ఇందులో పోలింగ్‌ కేంద్రాలు 267కలిగి ఉన్నాయి. శ్రీకాళహస్తి నియోజవర్గంలో 2,43,197 మంది ఓటర్లు కలిగి ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,25,546 మంది కలిగి ఉన్నారు.పురుష ఓటర్లు 1,17,635 మంది కలిగి ఉన్నారు. 293 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గూడూరు ఎస్సీ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,40,388 మంది కలిగి ఉన్నారు.ఇందులో మహిళా ఓటర్లు 1,23,371 మంది కలిగి ఉన్నారు. పురుష ఓటర్లు1,16,982 మంది కలిగి ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాలు 294 ఏర్పాటు చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో 2,39,240 మంది ఓటర్లు కలిగి ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,22,300 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 1,16, 936 మంది ఉన్నారు. 298 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,37,700 మంది ఓటర్లు కలిగి ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,21,876 మంది ఉన్నారు.పురుష ఓటర్లు 1,15,802 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం పోలింగ్‌ కేంద్రాలు 304 ఏర్పాటు చేశారు. సత్యవేడు ఎస్సీ అసెంబ్లీకి మొత్తం ఓటర్లు 2,11,378 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 1,08,797 మంది కలిగి ఉన్నారు. మహిళా ఓటర్లు 1,02,568మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాలు 279 ఏర్పాటు చేయడం జరిగింది.

➡️