టాస్క్‌ ఫోర్స్‌ దాడులు ఎర్రచందనం దొంగలు అరెస్ట్‌

టాస్క్‌ ఫోర్స్‌ దాడులు ఎర్రచందనం దొంగలు అరెస్ట్‌

టాస్క్‌ ఫోర్స్‌ దాడులు ఎర్రచందనం దొంగలు అరెస్ట్‌ప్రజాశక్తి -సత్యవేడు: సత్యవేడు మండలం ఇందిరా నగర్‌ సమీపంలో ఓ ప్రైవేటు లైసెన్స్‌ ఎర్ర చందనం గొడౌన్‌ లో తమిళనాడుకు చెందిన ఎర్రచంద నం స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలు దొంగలించి లారీలో వేసుకొని వెళుతుండగా సినీ ఫక్కీలో వారిని వెంబడించి దాడులు చేసి లారీతో సహా నాలుగు టన్నుల పైగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు 16 మంది ఎర్రచందనం స్మగర్లను అదుపులోకి తీసుకున్నారు. అందులో తమిళనాడుకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. అప్పుడప్పుడూ ఎర్రచందనం గొడౌన్లో కాపలా దారులను బెదిరించి వారిని కట్టివేసి తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగలు దాడులు చేసి ఎర్రచందనం దుంగలను తీసుకెళ్లేవారు. ఈ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్సు అధికారులు వారం రోజులుగా నిఘావేశారు. ఈ మేరకు దాడిచేసి ఎర్రచందనం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో దాదాపు 30 మంది టాస్క్‌ఫోర్సు అధికారులు పాల్గొన్నారు. ఈ కేసును స్థానిక పోలీసులకు అప్పగించారు. వివరాలను గోప్యంగా వుంచారు.

➡️