టిటిడి ఇళ్ల ప్రొసీడింగ్స్‌పై జగన్‌ బొమ్మ దేనికి : సిఐటియు

టిటిడి ఇళ్ల ప్రొసీడింగ్స్‌పై జగన్‌ బొమ్మ దేనికి : సిఐటియు

టిటిడి ఇళ్ల ప్రొసీడింగ్స్‌పై జగన్‌ బొమ్మ దేనికి : సిఐటియుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు అందిస్తున్న ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్‌పై ఒకవైపున టిటిడి ఎంబ్లంతో కూడిన వెంకటేశ్వర స్వామి బొమ్మ, మరోవైపున జగన్మోహన్‌ రెడ్డి బొమ్మను పెట్టి ప్రొసీడింగ్స్‌ ఇవ్వడం అభ్యంతరకరమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఓ ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. టీటీడీ ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్‌ లోను రాజకీయ పార్టీ నేతల బొమ్మలను ప్రచురించడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వ ప్రచార పిచ్చికి ఇది పరాకాష్టగా ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు సైన్‌ బోర్డులు, వైఎస్‌ఆర్‌ కిట్లు, జగనన్న విద్యా దీవెన, జగనన్న పథకాలకు తన ఫోటోను తగిలించి సంబరపడిపోతున్న ముఖ్యమంత్రి ఆఖరుకు తిరుమల వెంకటేశ్వర స్వామితో సమానంగా తన ఫోటోను ముద్రించి ఇవ్వడం భక్తుల మనోభావాలతో చెలగాట మాడటమేనని ఆయన అన్నారు. తక్షణం ప్రొసీడింగ్స్‌ పై ఫోటోలను తీసి వేయాలని టిటిడి యాజమాన్యానికి ఆయన సూచించారు.

➡️