టెన్త్‌ పరీక్షా కేంద్రంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

టెన్త్‌ పరీక్షా కేంద్రంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

టెన్త్‌ పరీక్షా కేంద్రంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీప్రజాశక్తి – తిరుపతిజిల్లాలో పదో తరగతి మెయిన్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మి శ ఆకస్మిక తనిఖీ చేశారు.బుధవారం శ్రీ పద్మావతి బాలికోన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. తాగునీరు, ఎఎన్‌ఎం ఏర్పాటు, అత్యవసర మందులను పరిశీలించారు. ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని చీఫ్‌ సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా జాగ్రత్తలు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ నిషాంత్‌రెడ్డి ఉన్నారు. ప్రశాంతంగా టెన్త్‌ ఆంగ్ల పరీక్షపదో తరగతి పరీక్షల్లో ముడోరోజైన రోజైన బుధవారం ఆంగ్ల పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తిరుపతి జిల్లాలో 162 పరీక్ష కేంద్రాల్లో 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, 162 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌ లు, 1753 మంది ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో నిర్వహించారు. మొత్తం 26,941 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 26,570 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. మిగిలిన 371 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్‌ పేర్కొన్నారు. 98.6 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రకటించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

➡️