తర్పనాలకు విశాల ప్రదేశం ఇవ్వండి

తర్పనాలకు విశాల ప్రదేశం ఇవ్వండిప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతి నగర పరిధిలోని కపిలతీర్థం వద్ద తిరుపతి నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పర్వదినాల్లో వారి పితదేవతలకు తర్పణ కార్యక్రమాలు చేసుకోవడానికి వస్తుంటారని, విశాల ప్రదేశాన్ని తర్పణ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఇవ్వాలని టీటీడీని శ్రీ కపిలేశ్వర పురోహిత సేవా సంఘం గౌరవ సలహాదారు సంస్కార్‌ రాజేష్‌ విజ్ఞప్తి చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం కార్యదర్శి పారా విజయకుమార్‌ మాట్లాడుతూ రెండు రోజులకు ముందు సంక్రాంతి రోజున పిత తర్పణ కార్యక్రమానికి తిరుపతి నగరంలో నుండి కపిలతీర్థం వద్దకు వేలాది సంఖ్యలో ప్రజలు రావడంతో కొంత అసౌకర్యం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది శ్రీవారి సంఘం పేరుతో, వివిధ ప్రాంతాల నుంచి ముందురోజు రాత్రే అక్కడకు చేరుకుని ముందస్తుగా పట్టలు పరిచారన్నారు. దీంతో తిరుపతిలో స్థానికంగా ఉండే బ్రాహ్మణులు ఇబ్బందులు పడాల్సివచ్చిందన్నారు. టిటిడి నిఘా అధికారులు ఇకపై గుర్తింపు ఉన్న వారినే క్రమ పద్ధతిలో కూర్చోపెట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షులు అన్నదానం అనిల్‌, కోశాధికారి మోహన శర్మ పాల్గొన్నారు.

➡️