తుడా సెక్రటరీగా జి.వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరణ

Dec 21,2023 22:14
తుడా సెక్రటరీగా జి.వెంకట నారాయణ బాధ్యతలు స్వీకరణ

ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌తిరుపతి పట్టణాభివద్ధి సంస్థ(తుడా) సెక్రటరీ గా జి.వెంకట నారాయణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మెన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డికి, వీసీ హరికష్ణ కు పుష్పగుచ్చం అందజేసి మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతి రూరల్‌ ఎంపిడిఓ గా జి.వెంకట నారాయణ ఉద్యోగోన్నతిపై జిల్లా విజిలెన్స్‌ ఆఫీసర్‌గా వైఎస్సార్‌ కడప జిల్లాకు బదిలీపై వెళ్ళారు. తిరిగి అక్కడ నుంచి తుడా సెక్రటరీ గా బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న సెక్రటరీ లక్ష్మీ మాత సంస్థకు రిపోర్ట్‌ చేసుకోనున్నారు.

➡️