తుపాను ను జాతీయ విపత్తుగా ప్రకటించాలిఅఖిలపక్ష నాయకులు డిమాండ్‌

తుపాను ను జాతీయ విపత్తుగా ప్రకటించాలిఅఖిలపక్ష నాయకులు డిమాండ్‌

తుపాను ను జాతీయ విపత్తుగా ప్రకటించాలిఅఖిలపక్ష నాయకులు డిమాండ్‌ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: రాష్ట్రంలో తుపాను, కరువు నష్టాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఆధ్వర్యంలో సోమవారం బైరాగిపట్టెడ సిపిఐ కార్యాలయంలో అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈసందర్భంగా సిపిఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు, ఆర్‌పిఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర, రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకయ్య, జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జ్‌ కిరణ్‌ రాయల్‌, టిడిపి నాయకులు కార్పొరేటర్‌ ఆర్‌సి.మునికష్ణ మాట్లాడుతూ తుపాన్‌ వల్ల తిరుపతి జిల్లాలో అత్యధిక శాతం పోయారని, అరకొర పండించిన పంటలన్నీ నీళ్లపాలు అయ్యాయని అన్నారు. అత్యధిక శాతం సూళ్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గంలో నష్టం వాటిల్లిందన్నారు. సీఎం జగన్మోహన్‌ రెడ్డి జిల్లాలో పర్యటించిన ఒక్క రూపాయి కూడా నష్టపోయిన రైతాంగానికి సహాయ సహాయక చర్యలు అందించలేదని విమర్శించారు. కేంద్రం నుండి జాతీయ విపత్తు నిధులు అడగలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా తుపాను నష్టం జరిగిన పట్టినట్లు వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తుపాను నష్టం, అదేవిధంగా కొన్ని రాయలసీమ జిల్లాలలో కరువు విలయతాండవం చేస్తుందని జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణమే 10000 వేల కోట్లు సహాయ అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈనెల 14వ తేదీన కలెక్టర్‌ కార్యాలయం వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నిర్ణయించారు. సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.రాధాకష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తులసి రాజన్‌, రైతు సంఘం నాయకులు బెల్లంకొండ శ్రీనివాస్‌, నగర కార్యవర్గ సభ్యులు బండి చలపతి, ఎన్‌.శివ, కేవైరాజా, పద్మనాభ రెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.

➡️