తెల్లారేసరికి…సర్దుకున్నారు..!తిరుపతిలో ఆరణి శ్రీనివాస్‌ ప్రచారంసుగుణమ్మకు న్యాయం చేస్తామని హామీపవన్‌ మాటే వేదం అంటున్న పసుపులేటిసత్యవేడు నుంచి పోటీ చేస్తా : జేడీ రాజశేఖర్‌

తెల్లారేసరికి...సర్దుకున్నారు..!తిరుపతిలో ఆరణి శ్రీనివాస్‌ ప్రచారంసుగుణమ్మకు న్యాయం చేస్తామని హామీపవన్‌ మాటే వేదం అంటున్న పసుపులేటిసత్యవేడు నుంచి పోటీ చేస్తా : జేడీ రాజశేఖర్‌

తెల్లారేసరికి…సర్దుకున్నారు..!తిరుపతిలో ఆరణి శ్రీనివాస్‌ ప్రచారంసుగుణమ్మకు న్యాయం చేస్తామని హామీపవన్‌ మాటే వేదం అంటున్న పసుపులేటిసత్యవేడు నుంచి పోటీ చేస్తా : జేడీ రాజశేఖర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతిలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాస్‌ పోటీలో ఉంటారని ప్రకటించిన వెంటనే జనసేన, టిడిపి నాయకులు ఊగిపోయారు.. ‘ఆరణి గో బ్యాక్‌’ అంటూ గురువారం ప్రతాపం చూపారు. శుక్రవారం రామతులసి కల్యాణ మండపంలో మరోసారి సమావేశం అయ్యి ‘లోకల్‌’కు ప్రాధాన్యత ఇవ్వాలని అధినేతల దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు.. తెల్లారేసరికి ఏమయ్యిందో తెలియదు.. ఆలయానికి ఆరణి శ్రీనివాస్‌, పసుపులేటి హరిప్రసాద్‌ కలిసి వచ్చారు. కాకతాళీయంగానే అయినా అదే ఆలయంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి భూమన అభియన్‌రెడ్డి ఎదురుపడి పలకరించుకున్నారు. ఏమైతేనేం తెల్లారేసరికి ‘నిప్పు’ చల్లారింది. సుగుణమ్మకు ప్రోటోకాల్‌ పరిధిలో పదవి ఇచ్చి న్యాయం చేస్తామని అధినేత నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చినట్లు సమాచారం. తిరుపతిలో టిడిపి శ్రేణుల్లో నిరుత్సాహాన్ని పోగొట్టే బాధ్యతను సుగుణమ్మపైనే ఉంచినట్లు తెలుస్తోంది. తిరుపతిలో వలస వచ్చిన ఆరణి శ్రీనివాస్‌కు టిడిపి, జనసేన నేతలు ఆహ్వానం పలికితే, సత్యవేడులో ఆదిమూలం స్థానంలో జేడీ రాజశేఖర్‌ అయిన తానే పోటీ చేస్తానని స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టారు. అధినేత చంద్రబాబునాయుడు తనకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. తెల్లారేసరికి మార్పులు చేర్పులతో తిరుపతిలో జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాస్‌ ఓకే అయ్యారు. అయితే సత్యవేడులో జేడీ రాజశేఖర్‌ పోటీ చేస్తానని ప్రకటించడంతో అధినేత చూపు ఆదిమూలం వైపు ఉంటుందో, జేడీ రాజశేఖర్‌ వైపు ఉంటుందో వేచి చూడాల్సిందే. శుక్రవారం తిరుపతి స్థానికులంతా కలిసి రామతులసి కల్యాణ మండపంలో సమావేశం అవ్వాలని భావించినా ఆ సమావేశం వాయిదా పడింది. పవన్‌ కల్యాణ్‌ జోక్యం చేసుకోవడం వల్లనే గురువారం రగిలిన ‘అగ్గి’ చల్లారిపోయిందని తెలుస్తోంది. శుక్రవారం తిరుపతి జనసేన ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు కపిలేశ్వర ఆలయం వద్ద అభయ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. తర్వాత గంగమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. జనసేన అధినేత డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌ ఆరణి శ్రీనివాస్‌తో కలిసి ఉండటం విశేషం. గురువారం ఓ హోటల్లో జరిగిన సమావేశంలో పసుపులేటి హరిప్రసాద్‌ హాజరై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తెల్లారేసరికి ఆరణి శ్రీనివాస్‌తో కలిసి ప్రత్యక్షమయ్యారు. అయితే తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌ మాత్రం ప్రచారంలో ఎక్కడా కనబడలేదు. శుక్రవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడిందని, త్వరలో మరో తేదీ ప్రకటిస్తామని వాట్సాప్‌ గ్రూప్‌లో సమాచారం పెట్టారు. అయితే అధినేత పవన్‌కల్యాణ్‌ మాత్రం లోకల్‌, నాన్‌ లోకల్‌ సమస్యను పక్కన పెట్టి జనసేన అభ్యర్థి గెలిచేలా పనిచేయాలని, లేదంటే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించడం వల్లనే జనసేన నేతలు మెత్తబడినట్లు సమాచారం. టిడిపి నేతలు సుగుణమ్మ, నరసింహయాదవ్‌లను పదవుల ఆశ చూపి సర్దుబాటు చేయడంతో టిడిపి, జనసేన నేతలు కలిసి ఒకే తాటిపైకి వచ్చి ఆరణి శ్రీనివాస్‌ను అభ్యర్థిగా అంగీకరించినట్లే. సత్యవేడు నుంచి పోటీ చేస్తా : జేడీ రాజశేఖర్‌ సత్యవేడు టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ఆదిమూలం పేరు ఖరారయ్యింది. అయితే సత్యవేడు ఎంఎల్‌ఎ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని జేడీ రాజవేఖర్‌ తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. కార్యకర్తలంతాను తాను పోటీలో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఒకవేళ ఆదిమూలంకే టిక్కెట్‌ను అధినేత ప్రకటిస్తే, జేడీ పరిస్థితి ఏంటన్నది వేచి చూడాల్సిందే.

➡️