దున్నపోతు ప్రభుత్వంఇంటికెళ్లడం ఖాయం’సోది’ చెప్పిన అంగన్‌వాడీలుజిల్లావ్యాప్తంగా నిరసనల హోరునేడు కలెక్టరేట్‌ ముట్టడికి సన్నద్ధం

దున్నపోతు ప్రభుత్వంఇంటికెళ్లడం ఖాయం'సోది' చెప్పిన అంగన్‌వాడీలుజిల్లావ్యాప్తంగా నిరసనల హోరునేడు కలెక్టరేట్‌ ముట్టడికి సన్నద్ధం

దున్నపోతు ప్రభుత్వంఇంటికెళ్లడం ఖాయం’సోది’ చెప్పిన అంగన్‌వాడీలుజిల్లావ్యాప్తంగా నిరసనల హోరునేడు కలెక్టరేట్‌ ముట్టడికి సన్నద్ధం గత 22 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా దున్నపోతుపై వర్షం పడిన చందంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది’ అంటూ అంగన్‌వాడీలు అగ్గిమీద గుగ్గిళమయ్యారు. వినతిపత్రాలు ఇచ్చిన హామీలు నెరవేర్చని జగన్మోహన్‌రెడ్డికి ఇచ్చినా ఒకటే, దున్నపోతుకు ఇచ్చినా ఒకటే అంటూ జిల్లావ్యాప్తంగా దున్నపోతులకు మంగళవారం వినతిపత్రాలు ఇచ్చారు. నాయుడుపేటలో అంగన్‌వాడీలు హామీలు నెరవేర్చని జగన్మోహన్‌రెడ్డి ఇంటికెళ్లడం ఖాయం అంటూ ‘సోది’ చెబుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజాశక్తి – యంత్రాంగం – నాయుడుపేటలో సిఐటియు జిల్లా నాయకులు ఎ.పుల్లయ్య పాల్గొన్నారు. ఓ అంగన్‌వాడీ మహిళ ‘సోది చెబుతానమ్మ సోది’ అంటూ జగనన్న పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నీ సోదిగా చెప్పి వినిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకవి ముకుంద, అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యదర్శి ఎన్‌.శ్యామలమ్మ, సంధ్య, నాగమణి, చంగమ్మ, కళావతి, వి.శ్యామలమ్మ, మేరి, ప్రమీల పాల్గొన్నారు. – తిరుపతి టౌన్‌లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మద్దతు ప్రకటించారు. 22 రోజులుగా రాష్ట్రంలోని 56వేల అంగన్‌వాడీ సెంటర్లను మూసివేసి, లక్ష మందికి పైగా అంగన్‌వాడీలు పెద్దఎత్తున పోరాటం చేస్తుంటే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పౌష్టికాహారం గత 22 రోజులుగా ఆగిపోయిందన్నారు. తిరుపతిలోనూ దున్నపోతుకు వినతిపత్రం అందించారు. 3వ తేదీ చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు కె.వేణుగోపాల్‌, టి.సుబ్రమణ్యం, టిటిడి కాంట్రాక్టు కార్మికులు రఘు, త్యాగరాజు, పార్థసారథి, బాలాజీ పాల్గొన్నారు. – సూళ్లూరుపేటలో ఆవుకు వినతిపత్రం అందించారు. సిఐటియు నాయకులు ఎ.పుల్లయ్య, కె.సాంబశివయ్య, సిహెచ్‌ సుధాకర్‌రావు సంఘీభావం ప్రకటించారు. అంగన్‌వాడీ నాయకురాలు మేకల హైమావతి మాట్లాడుతూ కార్మికులకు న్యాయం జరిగేంత వరకూ ప్రశాంతంగా కలసికట్టుగా పోరాడాలన్నారు. – గూడూరు టౌన్‌లో పాత ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిరసన దీక్ష కొనసాగించారు. ఇంద్రావతి, ప్రభావతి, ప్రసన్నలక్ష్మి, పెంచలమ్మ, సిఐటియు నాయకులు సురేష్‌ పాల్గొన్నారు. – పుత్తూరు టౌన్‌లో తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె కొనసాగింది. సిఐటియు నాయకులు ఆర్‌.వెంకటేష్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద దున్నపోతుకు అర్జీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముని కుమారి, విజయ కుమారి, కష్ణవేణి, ధనమ్మ, రాధా, పద్మజ పాల్గొన్నారు. – శ్రీకాళహస్తిలో రైతుసంఘం, విఒఎల నేతలు మద్దతు ప్రకటించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. అంగన్వాడీలు గొంతెమ్మ కోర్కెలు కోరలేదనీ, న్యాయపరమైన డిమాండ్లను జగన్‌ సర్కార్‌ పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నాయకులు గెడి వేణు, రామయ్య, దాసరి జనార్ధన్‌, హేమలత పాల్గొన్నారు. – సత్యవేడులో సిఐటియు డివిజన్‌ కార్యదర్శి రమేష్‌ ఆధ్వర్యంలో కళ్లకు నల్ల రిబ్బన్‌ కట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిర్మల, శాంతి, ఇందిర, ఝాన్సీ, భారతి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. – రేణిగుంటలో జీసస్‌ ఆటోస్టాండ్‌ కార్మికులు మద్దతు ప్రకటించారు. ‘దున్నపోతు యమధర్మరాజు’కు వినతిపత్రం సమర్పించారు. పదో రోజు రిలే దీక్షలో అంబిక, మరియమ్మ, కోమల, మాధవి, పుష్పలత, పవిత్రభాయి, రేఖ, అంజీరమ్మ, కవిత, మునిలక్ష్మి పాల్గొన్నారు. నాయకులు హరినాథ్‌, కరీముల్లా పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్‌ ఎదుట బైఠాయింపుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో జగన్మోహన్‌రెడ్డి మొండివైఖరిని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట తలపెట్టిన బైఠాయింపు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అధ్యక్ష కార్యదర్శులు పద్మలీల, వాణీశ్రీ పిలుపునిచ్చారు.ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లాలోని 12 ప్రాజెక్టులకు చెందిన అంగన్‌వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, ఆయాలు పెద్దసంఖ్యలో తరలిరావాలన్నారు. తప్పనిసరిగా యూనిఫాంలో రావాలని, ప్రతి కార్యకర్తా సొంతంగా భోజనం, వాటర్‌బాటిల్‌ తీసుకురావాలని, వచ్చేటపుడు నల్లటి గొడుగు తేవాలని సూచించారు. సిఐటియు సంఘీభావం ప్రకటించింది.

➡️