దొంగోట్లను రద్దు చేయాలని టిడిపి ర్యాలీ

దొంగోట్లను రద్దు చేయాలని టిడిపి ర్యాలీ

దొంగోట్లను రద్దు చేయాలని టిడిపి ర్యాలీప్రజాశక్తి- తిరుపతి తిరుపతి నగరంలో నమోదైన దొంగ ఓట్లు రద్దు చేయాలని కోరుతూ టిడిపి ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక స్విమ్స్‌ సర్కిల్‌ నుంచి టిడిపి శ్రేణులు ర్యాలీ చేపట్టి ఓల్డ్‌ మెటర్నరీ హాస్పిటల్‌ మీదుగా తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం వరకు చేరుకున్నారు. అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ తిరుపతిలో 40వేలకు పైగా దొంగఓట్లను అధికార పార్టీ నమోదు చేసిందని విమర్శించారు. తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం దొంగ ఓట్ల ఫ్యాక్టరీగా తయారైందని ఎద్దేవ చేశారు. ఇక్కడున్నా ఇద్దరు డిప్యూటీ మేయర్లు దొంగ ఓట్లు చేర్చే పనిలోనే నిమగమయ్యారని ధ్వజమెత్తారు. అధికారులు స్పందించి అడ్డుకొని, దొంగ ఓట్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, వూకా విజరు కుమార్‌, జె బి శ్రీనివాసులు, నరసింహ యాదవ్‌, దంపూరి భాస్కర్‌, ఆర్‌ సి మునికష్ణ, వినుకొండ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

➡️