నారా భువనేశ్వరికి ఘన స్వాగతం

నారా భువనేశ్వరికి ఘన స్వాగతం

నారా భువనేశ్వరికి ఘన స్వాగతంప్రజాశక్తి -రామచంద్రపురం ( చంద్రగిరి)రాయచోటిలో నిజం గెలవాలి కార్యక్రమం కోసం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. తుమ్మలగుంట పరిధిలో మఠం భూమిలో నిర్మించిన, ఆక్రమించిన అధికార పార్టీ నాయకులు, బడాబాబులు జోలికి వెళ్లకుండా మఠం అధికారులు పేదల షెడ్లను పోలీసు జులుంతో తొలగిస్తున్న సందర్భంలో పేదల పక్షాన నిలబడి పోరాటం సాగిస్తున్న సమయంలో పోలీసుల తోపులాటలో గాయాలైన పులివర్తి సుధారెడ్డిని నారాభువనేశ్వరి పరామర్శించారు. ఏ రంగంపేట- భాకరాపేట మార్గంలో రాయచోటి బయలుదేరిన ఆమెను దుశ్శాలువాలతో మహిళలు సన్మానించారు.

➡️