నేడు గ్రూప్‌ 2 పరీక్షహెల్ప్‌ డెస్క్‌ నెంబర్లు 9000665565, 9676928804

నేడు గ్రూప్‌ 2 పరీక్షహెల్ప్‌ డెస్క్‌ నెంబర్లు 9000665565, 9676928804

నేడు గ్రూప్‌ 2 పరీక్షహెల్ప్‌ డెస్క్‌ నెంబర్లు 9000665565, 9676928804ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ఈనెల 25వ తేదీన ఆదివారం నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌- 2 పరీక్ష కోసం జిల్లాలో కట్టు దిట్టమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ డా. జి లక్ష్మీ శ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంట వరకు పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు ఉదయం 09:30 గంటల నుంచి 10 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, పరీక్షా కేంద్రానికి ఉ.10.15 గం.ల తరువాత వచ్చిన అభ్యర్థులు అనుమతించబడరని తెలిపారు. గ్రూప్‌- 2 పరీక్షల నిర్వహణ కు జిల్లా లో 61 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 27,894 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. మొబైల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వాచ్‌లకు అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. అభ్యర్థుల సందేహాల నివత్తి కొరకు హెల్ప్‌ డెస్క్‌ నెంబర్‌ 9000665565, 9676928804 ను ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చునని, పరీక్ష మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు పరీక్ష కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, మెడికల్‌ కిట్‌ తో పాటు ఒక ఏఎన్‌ఎం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

➡️