పార్లమెంట్‌లో ఎంపిల సస్పెన్షన్‌పై…వామపక్షాలు, కాంగ్రెస్‌ నిరసనలు

పార్లమెంట్‌లో ఎంపిల సస్పెన్షన్‌పై...వామపక్షాలు, కాంగ్రెస్‌ నిరసనలు

పార్లమెంట్‌లో ఎంపిల సస్పెన్షన్‌పై…వామపక్షాలు, కాంగ్రెస్‌ నిరసనలుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు 146మంది ఎంపీలపై సస్పెన్షన్‌ విధించడాన్ని నిరసిస్తూ ‘ఇండియా వేదిక’ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసనలు హోరెత్తాయి. ఎంపిల సస్పెన్షన్‌ ప్రజాస్వామాన్ని ఖూనీ చేయడమేనని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు తిరుపతి అంబేద్కర్‌ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ, సమాజ్‌వాది పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్‌, సమాజ్‌వాద్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి మాట్లాడుతూ పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు ప్రశ్నించడాన్ని సహించలేక మోదీ ప్రభుత్వం వారిని సస్పెండ్‌చేసిందన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి హిందూత్వవాదంతో, దేవాలయాల పేరు చెప్పి, దేశ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని, కులమతాల మధ్య అల్లర్లు సృష్టించి ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థను తీసుకురావడానికి బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. ఎంపిలపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు చిన్నం పెంచలయ్య, కె.రాధాక్రిష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, టి.సుబ్రమణ్యం, బుజ్జి, జయచంద్ర, సాయిలక్ష్మి, నరేంద్ర, వేణు పాల్గొన్నారు. తిరుపతి నగర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తిరుపతి జిల్లా అధ్యక్షులు పంట శ్రీనివాసులురెడ్డి, నగర అధ్యక్షులు యార్లపల్లి గోపి నాయకత్వం వహించారు. గూడూరులో… టవర్‌క్లాక్‌ సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిపిఎం నాయకులు బాలసుబ్రమణ్యం, జోగి శివకుమార్‌, బివి రమణయ్య, ఎస్‌.సురేష్‌, ఎ.ప్రసాద్‌, సిహెచ్‌ ప్రభాకర్‌, ఎస్‌కె కాలేషా పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో.. అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ బత్తెయ్యనాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోందన్నారు. బిఎన్‌ కండ్రిగలో.. సిపిఎం సత్యవేడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దాసరి జనార్ధన్‌, సిపిఐ నాయకులు కత్తి ధర్మయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

➡️