పోలీసులపై ఎమ్మెల్యే అసహనం- ఆకతాయిలపై కేసు ఎందుకు పెట్టలేదంటూ మండిపాటు- కళాశాలలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు ధ్వంసం కావడం పట్ల ఆగ్రహం

పోలీసులపై ఎమ్మెల్యే అసహనం- ఆకతాయిలపై కేసు ఎందుకు పెట్టలేదంటూ మండిపాటు- కళాశాలలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు ధ్వంసం కావడం పట్ల ఆగ్రహం

పోలీసులపై ఎమ్మెల్యే అసహనం- ఆకతాయిలపై కేసు ఎందుకు పెట్టలేదంటూ మండిపాటు- కళాశాలలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లు ధ్వంసం కావడం పట్ల ఆగ్రహంప్రజాశక్తి-పిచ్చాటూరు: ఆకతాయిలు చేస్తున్న ఆగడాలపై ఎందుకు కేసు పెట్టలేదంటూ ఎమ్మెల్యే ఆదిమూలం పిచ్చాటూరు పోలీసులపై ఫైర్‌ అయ్యారు. శనివారం ఆయన పిచ్చాటూరు మండలంలో పర్యటించారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను ఆకతాయిలు ధ్వంసం చేసినట్లు అధ్యాపకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోయినట్లు వివరించారు. అక్కడే ఉన్న హెడ్‌కానిస్టబుల్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆ తరువాత ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు ఫోన్‌ చేసి కేసు ఎందుకు నమోదు చేయలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రి సమయాల్లో గస్తీ పెం చాలని, ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవ హరించాలని ఎమ్మెల్యే చెప్పారు. ఇలాంటి సంఘ టనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం ద్వారా కళాశాల ఆవరణను శుభ్రం చేయాలని ఎంపీడీవో శ్రీనివాసులకు సూచించారు. అభివద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కళాశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌ను ఆదేశించారు.

➡️