ప్రతిభను గుర్తించేందుకే ‘ఆడుదాం..ఆంధ్రా’జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభం

ప్రతిభను గుర్తించేందుకే 'ఆడుదాం..ఆంధ్రా'జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభం

ప్రతిభను గుర్తించేందుకే ‘ఆడుదాం..ఆంధ్రా’జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభంప్రజాశక్తి – తిరుపతి సిటిముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏ పనిచేసినా ఒక చరిత్ర అని, క్రీడాకారుల గుర్తింపు, యవత ప్రతిభను గుర్తించి వారి దేహదారుడ్యం, మేధస్సు పెంచడం లక్ష్యంగా దేశంలోనే వినూత్నరీతిలో ఆడుదాం ఆంధ్రా క్రీడలు నిర్వహణకు శ్రీకారం చుట్టారని డిప్యూటి సి ఎం కె.నారాయణ స్వామి అన్నారు. నెహ్రూ మునిసిపల్‌ హైస్కూల్‌ మైదానంలో జిల్లా వ్యాప్తంగా క్రీడల నిర్వహణకు డిప్యూటి సిఎం ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి , క్రీడా టార్చ్‌ రిలే ను జిల్లా క్రీడాకారులకు అందించి, మస్కట్‌ లోగో ను, జాతీయ జెండా , ఆడుదాం ఆంధ్రా జెండా ను ఆవిష్కరించి, క్రీడల ప్రతిజ్ఞ చేపట్టారు. సభాధ్యక్షులుగాకలెక్టర్‌ కె.వెంకటరమణా రెడ్డి, అతిధులుగా నగరపాలక కమిషనర్‌ హరిత, మేయర్‌ శిరీషా, డిప్యూటి మేయర్లు భూమన అభినయరెడ్డి, ముద్రనారాయణ పాల్గొన్నారు.డిప్యూటి సి ఎం మాట్లాడుతూ క్రీడాకారులను గుర్తించి దేశ, ప్రపంచ స్థాయి పోటీల్లో యువతను భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి ప్రతి ఏటా డిసెంబర్‌ మాసంలో జరిగేలా నిర్ణయించారని అన్నారు. పేదలకు విద్యను అందిస్తే సంపద అందించినట్లే అని గుర్తించి కులం మతం పార్టీ వంటివి చూడక అమ్మ ఒడి పథకం పెట్టారని, ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్‌ మీడియం, విద్యాకానుక పేరుతొ యునిఫాంతో సహా పుస్తకాలు అందిస్తున్నారని అన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆడుదాం -ఆంధ్రా క్రీడా పోటీలు రాష్ట్ర చరిత్రలోనే మొదటిదని , శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆలోచనలు కూడా అంతే స్థాయిలో గొప్పగా ఉంటాయని , ప్రస్తుత సమాజంలో టీవిలకు, సెల్‌ ఫోన్లకు అంకితమై మనుష్యుల మధ్య సంబంధాలు దూరమవుతున్నాయని, వాటిని ఈ క్రీడలతో అధిగమించ వచ్చని అన్నారు. గత నాలుగు నెలలుగా అధికారులు నిర్వహణపై దష్టి పెట్టారని, క్రీడల నిర్వహణ ఆషామాషీ కాకుండా ఆన్‌ లైన్‌ రిజిస్ట్రేషన్లు, సచివాలయ స్థాయి నుండే అవగాహన , 2 కె రాన్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభిస్తున్నామని అన్నారు. ఇప్పటికే 1 లక్ష 70 వేలకు పైగా క్రేదాకరులు, క్రీడలను చూడడానికి 35 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని, జిల్లాలో ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వామ్యులు అయి విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా క్రీడాధికారి సయ్యద్‌ సాహెబ్‌ , బ్యాడ్మింటన్‌ అంతర్జాతీయ క్రీడాకారుడు సజన పాల్గొన్నారు.

➡️