ప్రభుత్వ నిబంధనలు గాలికి-విద్యుత్‌ తీగలను లాక్కెళ్లిన లారీ

ప్రభుత్వ నిబంధనలు గాలికి-విద్యుత్‌ తీగలను లాక్కెళ్లిన లారీ

ప్రభుత్వ నిబంధనలు గాలికి-విద్యుత్‌ తీగలను లాక్కెళ్లిన లారీ – స్థానికుల భయభ్రాంతులుప్రజాశక్తి -రేణిగుంట: రేణిగుంట పట్టణంలోని పోలీసు వీధిలో శుక్రవారం సాయంత్రం ఒక పెద్ద లారీ లోడు వచ్చి ఇటు విద్యుత్‌ తీగులను లాక్కెళ్లింది. దీంతో ఓ ఇంటిలో కరెంటు మీటర్‌ కూడా బయటకు వచ్చేసింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణాలలో లారీ లోడ్లు రాత్రి 10గంటలు దాటిన తర్వాత వచ్చి తమ లోడును దింపుకొని వెళ్లడం యధావిధిగా సాగుతోంది. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ నిబంధనలు విస్మరించి వేళ కాని వేళల్లో లారీలోడ్లు ఎక్కువగా పట్టణంలోకి ప్రవేశించి ఇటు స్థానికులకు తీవ్ర ఇబ్బందుల్ని కలిగిస్తున్నాయి. రేణిగుంట నడిబొడ్డులో ఉన్న మంచినీళ్ల గుంట పక్కన వినాయక ట్రేడర్స్‌ కంపెనీకి రోజూ కొన్ని 30 40 లారీలు వస్తుంటాయి. ఇవి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో స్కూళ్లు ఉండడంతో చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మరును ఒక లారీ లోడు ఢకొీని విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ లారీలు పట్టణంలోకి టైం కానీ టైం లో వస్తున్నప్పటికీ అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇటు పోలీసులు కాని, పంచాయతీ వారు కాని తగిన చర్యలు చేపట్టడం లేదు. .ఇకనైనా ప్రభుత్వ అధికారులు చొరవ చూపించి లారీలను జనసందోహం లేని వేళల్లో అనుమతించాలని స్థానికులు కోరుతున్నారు.

➡️