బంగారు గొలుసు దొంగ ఆరెస్ట్

Dec 5,2023 21:57
బంగారు గొలుసు దొంగ ఆరెస్ట్

30 గ్రాముల బంగారు చైన్ స్వాధీనం

ప్రజాశక్తి – పుత్తూరు, టౌన్:
బంగారు గొలుసు దొంగ ఆరెస్ట్ చేసి 30 గ్రాముల బంగారు చైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు.పరమేశ్వరమంగళం గ్రామంలో నివసిస్తున్న మునస్వామి నాయుడు భార్య మేడలో బంగారు గొలుసు అపహరించిన విషయం తెలిసిందే. ఇన్స్పెక్టర్ అఫ్ పోలిస్ కె . లక్ష్మి నారాయణ వివరాలు మేరకు నిందితుడు తమిళనాడు రాష్ట్రం అరియలూరు జిల్లాకు చెందిన రమేష్ కుమారుడు ఆర్. రంజిత్రావు (22) పరమేశ్వర మంగళం వద్ద గల కేకేసి కాలేజీ లో ఎల్ ఎల్ బి ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను పరమేశ్వర మంగళం నందు నివసించు బాబు అనునతని ఇంట్లో, అతని స్నేహితుడు హరీష్ తో కలిసి అద్దెకి ఉంటున్నాడు. చెడు వ్యసనానికి అలవాటుపడి, డబ్బులు అవసరం ఉన్నందున దొంగతనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజులుగా ప్రక్కింట్లో కాపురం ఉంటున్న ఇద్దరు వయసు పైడిన ముసలోల్లని గమనిస్తూ ఉండి, నాగరత్నమ్మ అను ముసలి ఆమె మెడలో బంగారు తాళిబొట్టు, చైన్ ఉండడం గమనించినాడు. ఎవరూ లేనిది గమనించి, ఆమె కిచెన్ లో ఉండగా, ఇంటి లోకి వెళ్లి, ఆమె మెడలో ఉన్న తాలిబోట్టును బలవంతంగా లాగుతుండగా, ఆమె అరచింది. ఆమె అరిస్తే ఎవరైనా వస్తారని, ఆమెను చంపివేసైన ఆమె మెడలో ఉన్న చైను ను లోక్కొని వెళ్ళాలని అనుకొని, ఆమెను చేతితో గొంతు పైన కొట్టి, ఆమె చీరతో ఆమె గొంతుకి చుట్టి చంపబోయాడు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో చైన్ ను లోక్కొని పారిపోయాడు. మంగళవారం రూమ్ లో దాచి పెట్టిన చైన్ ను తీసుకొని వేపగుంట క్రాస్ వద్ద వాళ్ళ ఊరికి వెళ్ళడానికి బస్సు కోసం వేచి ఉండగా వెళ్లి పట్టుకున్నట్లు ఇన్స్పెక్టర్ అఫ్ పోలిస్ కె . లక్ష్మి నారాయణ తెలిపారు. ఈ నెల 4 తేదీ సాయంత్రం 05.00 గంటలకు పుత్తూరు మండలం వేపగుంట క్రాస్ వద్ద పోలీసులు ఆరెస్ట్ చేసి ఒక బంగారు తాళిబొట్టు, బంగారు మెడ గొలుసు, సుమారు 30 గ్రాముల బరువు, సుమారు రూ. 1,20,000 విలువ గల సొత్తును స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ‌‌. 5…… చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు

➡️