భూ రాబందులను వదిలి పేదలపైనే ప్రతాపంశ్రీ జెసిబిలతో గుడిసెలు తొలగింపుశ్రీ అడ్డుపడిన వారిపై లాఠీఛార్జ్‌శ్రీ మహిళలపైనా పోలీసుల దౌర్జన్యంశ్రీ సీపీఎం నేతల ”హౌజ్‌ అరెస్టు”లు పేదలకు న్యాయం చేయకుంటే ఉద్యమం

భూ రాబందులను వదిలి పేదలపైనే ప్రతాపంశ్రీ జెసిబిలతో గుడిసెలు తొలగింపుశ్రీ అడ్డుపడిన వారిపై లాఠీఛార్జ్‌శ్రీ మహిళలపైనా పోలీసుల దౌర్జన్యంశ్రీ సీపీఎం నేతల ''హౌజ్‌ అరెస్టు''లు పేదలకు న్యాయం చేయకుంటే ఉద్యమం

భూ రాబందులను వదిలి పేదలపైనే ప్రతాపంశ్రీ జెసిబిలతో గుడిసెలు తొలగింపుశ్రీ అడ్డుపడిన వారిపై లాఠీఛార్జ్‌శ్రీ మహిళలపైనా పోలీసుల దౌర్జన్యంశ్రీ సీపీఎం నేతల ”హౌజ్‌ అరెస్టు”లుశ్రీ పేదలకు న్యాయం చేయకుంటే ఉద్యమం ఉదతం: నేతల హెచ్చరికప్రజాశక్తి – తిరుపతి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములలో తిష్ట వేసిన భూరాబందులను వదిలి…. జానెడు ఇంటి స్థలం అడిగిన పేదలపై అటు అధికారులు, ఇటు పోలీసులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. రేణిగుంట మండలం, కరకంబాడి ఎర్రగుట్టపై పేదలు వేసుకున్న గుడిసెలపై మంగళవారం తెల్లవారు జామున తమ జులుంను ప్రదర్శించారు. వందలాది పోలీసులు చొరబడి, జెసిబిలతో గుడిసెలను నేలమట్టం చేశారు. ప్రొక్లెన్లను అడ్డుకున్న పేదలపై లాఠీ చార్జ్‌ చేశారు. అంతకు ముందే సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, రేణిగుంట మండల కార్యదర్శి హరినాథ్‌, సిఐటియు మండల అధ్యక్షుడు నరసింహారెడ్డిని ముందస్తుగానే ఉదయం 3 గంటల నుంచే హౌజ్‌అరెస్ట్‌ చేసి ఇంటి నుంచి బయటకు రానీయకుండా నిర్బంధించారు. ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటీ అధ్యక్షులు రాజశేఖర్‌, కార్యదర్శి సత్యశ్రీ, కమిటీ నాయకులు రాధిక, మునిబాబు, అరుణ్‌, మస్తాన్లను అరెస్టు చేశారు. అదే సమయంలో లాఠీ చార్జీతో స్పహ తప్పిన సిపిఎం సీనియర్‌ నాయకులు శివానందంనూ విడిచిపెట్టలేదు. సీనియర్‌ కామ్రేడ్‌ వెంకట రమణపైనా దాడి చేయడంతో ఎడమ కాలికి తీవ్రగాయమైన విడవకుండా ‘పేదలకు సపోర్టు వస్తారా మీ సంగతి తేలుస్తామంటూ దౌర్జన్యం చేశారు. పోలీసుల నిర్బంధం నుంచి బయటకు వచ్చిన సిపిఎం జిల్లా కార్యదర్శి వి.నాగరాజు ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజాసంఘాల నేతలు రేణిగుంట పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారు. పేదలకు న్యాయం చేయాల్సిన జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు ఇలా కుట్ర చేసి మరీ పేదలపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. పేదలకు న్యాయం చేసే వరకు సిపిఎం బాధితులకు అండగా ఉంటుందని ఉద్ఘాటించారు. వెంటనే పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు.పేదలకు మద్దతుగా నిలుస్తాం: సిపిఎం, సిపిఐభూ కబ్జాలపై 1వ తేదీ వామపక్షాల రౌండ్‌ టెబుల్‌ సమావేశంవామపక్ష నాయకుల స్పష్టీకరణ తిరుపతి (మంగళం): నిరుపేదలు గూడు కోసం చేస్తున్న పోరాటంపై అధికారులు మానవతా దృక్పదంతో వ్యవహరించాల్సింది పోయి పోలీసులను అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పేదల గుడిసెలను కూల్చుతారా అని సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సిపిఎం, సిపిఐ నాయకులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నాగరాజు మాట్లాడుతూ రేణిగుంట మండలం కరకంబాడీ పంచాయతీలోని సర్వే నెంబర్‌ 153/1 ఎర్రగుట్టపై గత నెల రోజులుగా జగనన్న పట్టాలు పొంది స్థలాల కోసం ఎదురుచూస్తున్న అర్హులు గుడిసెలు వేసుకొని పోరాటం చేస్తుంటే దాదాపు 600 మంది పోలీసులను, యంత్రాలను, ఫైర్‌ ఇంజన్లను పేదల గుడిసెల వద్దకు చేరుకొని ఒక్కసారిగా గుడిసెలను కూల్చివేయడం దారుణమన్నారు. ఇటు మంగళంలోనూ జగనన్న ఇళ్ళ పట్టాలు పొందిన వారికి అదే ప్రాంతంలోని చెన్నాయిగుంట సర్వే నెంబర్‌ 195/2లో స్థలాలను చూపాలని పోరాటం చేస్తే పోలీసులతో బలవంతపు అరెస్ట్‌లు చేయిస్తున్నారు. తిరుపతిలో కార్పొరేటర్లు, చంద్రగిరిలో, శ్రీకాళహస్తిలో నాయకులు వేల ఎకరాలు కబ్జాచేసి అమ్ముకోంటూ కోట్లు గడిస్తున్నారని, దోచుకున్న ఆయా కబ్జా భూముల్లో ఇది ప్రభుత్వ స్థలాలు అని బోర్డులు నాటే దైర్యం అధికారులకు ఉందా అని సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అదికారులకు సూటిప్రశ్న వేశారు. జిల్లా కలెక్టర్‌ పేదల పక్షపాతిగా మెలగాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి మాట్లాడుతూ తిరుపతి రూరల్‌ పరిధిలోని కూపుచంద్రపేటలో 200ఎకరాలకు పైగా భూఆక్రమణలు జరిగాయన్నారు. సాక్ష్యాతు తిరుపతి మేయర్‌ బంధువుల స్థలాన్ని కబ్జా చేసిన పట్టించుకోనే నాధుడేలేదన్నారు. నేడు అధికార పార్టీ నాయకులు చేస్తున్న భూకబ్జాలకు అధికారులు అండగా ఉండి మరీ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నేడు జరుగుతున్న భూకబ్జాలు, పేదలకు స్థలాల అంశాలపై 1వ తేదీ శుక్రవారం సిపిఐ కార్యలయంలో వామపక్ష పార్టీల రౌండ్‌ టెబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సిపిఎం నగర కార్యదర్శి సుబ్రమణ్యం, వేణుగోపాల్‌, బుజ్జి, మాధవకృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చిన్నం పెంచులయ్య, అమ్ములు, కుమారి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి: పెద్దలనొదిలేసి పేదలపైనే ప్రతాపం చూపడమేంటని సిపిఎం నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకంబాడీలో పోలీసులు అర్ధరాత్రి పేదల ఇల్లు కూల్చడంపై మంగళవారం సిపిఎం నాయకులు అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద నిరసన తెలియజేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి గంధం మణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కరకంబాడిలోని 600 కుటుంబాలకు మూడేళ్ల కిందట ఇంటి పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. అయితే ఇప్పటివరకు స్థలాన్ని చూపించలేదనీ, పేదలు ఎక్కడ నివసించాలని ప్రశ్నించారు. పది రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే, పోలీసులకు గుడిసెలు కూల్చేయాలని ఆదేశించడం దుర్మార్గమని వాపోయారు. ప్రభుత్వం వెంటనే పేదలకు స్థలాలు చూపించాలని డిమాండ్‌ చేశారు. పెనగడం గురవయ్య, కుమార్‌, వెలివేంద్రం, ఉస్మాన్‌ బాషా, రాజా, చిన్నబాబు పాల్గొన్నారు. రేణిగుంట: రేణిగుంట మండలంలో సర్వే నెం. 153/1 నందు కరకంబాడీ ఎర్రగుట్ట పై సుమారు 5వేలు మంది గుడిసెలు వేసుకొని 33 రోజులుగా జీవనం సాగిస్తుంటే మంగళవారం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ నాయకత్వంలో పేదల గుడిసెలను తొలగించడం,పేదలపై లాఠీ ఛార్జి చేయడం దుర్మార్గమని ఈ ఘటనను సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నామని రేణిగుంట మండల కార్యదర్శి కె.హరినాథ్‌ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.

➡️