మహానగరాలకు దీటుగా ‘చిత్తూరు’ఇంటర్వ్యూనగరపాలక కమిషనర్‌ అరుణ

మహానగరాలకు దీటుగా 'చిత్తూరు'ఇంటర్వ్యూనగరపాలక కమిషనర్‌ అరుణ

మహానగరాలకు దీటుగా ‘చిత్తూరు’ఇంటర్వ్యూనగరపాలక కమిషనర్‌ అరుణప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: స్వచ్ఛసర్వేక్షన్‌ రాష్ట్రస్థాయిలో చిత్తూరు కార్పొరేషన్‌ 9వ ర్యాంకు సాధించడం జరిగింది. జాతీయ స్థాయిలో 446 నగర పాలక సంస్థలో 446 ర్యాంకులో నిలిచింది. 22 ఏడాదితో పొల్చితే చిత్తూరు జిల్లా పది స్థానాలు ముందున్నది. రాష్ట్రస్థాయిలో 31 నగరాలతో పోటీపడుతూ 9వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్‌లో గత ఏడాది ర్యాంకు 153 కంటే 10 ర్యాంకులు మెరుగుపరచుకుంది. గత ఏడాది 382 నగరాలు పోటీ పడగా, ఈ ఏడాది 446 నగరాలు పోటీపడ్డాయి. జనాభా పరంగా మనకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలతో దీటుగా పోటీపడుతూ.. పారిశుద్ధ్యం, ఇంటింటి చెత్త సేకరణ, డంపింగ్‌ యార్డ్‌ నిర్వహణ, ఓడిఎఫ్‌ ప్లస్‌, సిటిజన్‌ ఫీడ్బ్యాక్‌ కేటగిరీలో గతంలో కంటే మెరుగైన మార్కులు సాధించింది. 2022లో 3,433.86 మార్కులు సాధించగా.. 2023లో 5,174.45 మార్కులు సాధించింది. అమృత్‌2.0లో భాగంగా సివేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌, ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు మంజూరయ్యాయి. ఇవి పూర్తై అందుబాటులోకి వేస్తే మహానగరాలకు దీటుగా మరింత మెరుగైన ర్యాంకు సాధించే అవకాశం ఉంది. స్వచ్ఛ సర్వేక్షన్‌ 2023లో మెరుగైన ఫలితాలు సాధించడంపై నగర కమిషనర్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాశక్తి ప్రత్యేక ఇంటర్వూలో..ప్రజాశక్తి: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య కార్యక్రమాలెలా ఉన్నయి..? కమిషనర్‌: నగర పాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లున్నాయి. పర్మినెంట్‌, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ క్రింద పారిశుధ్య కార్మికులు 360 మంది పని చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ సిబ్బంది 70 మంది వరకు పని చేస్తున్నారు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌లో భాగంగా ఎప్పటి చెత్త అప్పుడే తొలగించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇంటింటా చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రజాశక్తి : నగరంలో తాగునీటి సమస్య ఉందా..? కమిషనర్‌: ఎన్‌టిఆర్‌ జలాసయంలో గతేడాది నుండీ వర్షాలతో నీటి మట్టం బాగా ఉంది, అలాగే భూగర్భ జలమట్టం పెరగడంతో మోటరు బోర్ల నుండీ నీటి సరఫరా చేయడం జరుగతోంది. చిత్తూరుకు తాగునీటి శాశ్వత పరిష్కరం కోసం పైపులైన్‌ పనులు జరుగుతున్నాయి. అడవిపల్లి రిజర్వాయర్‌ నుండీ చిత్తూరు తాగునీటిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రజాశక్తి : స్వచ్ఛసర్వేక్షన్‌ ర్యాంకుల పట్ల మీ అభిప్రాయం..? కమిషనర్‌: స్వచ్ఛసర్వేక్షన్‌లో చిత్తూరు నగర పాలక సంస్థకు సంతృప్తి కరంగా రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు రావడం జరిగింది. గ్రీనరీ పెంపు కోసం కట్టమంచి, గంగినేని చెరువుల వద్ద గ్రీనరీ పెంపు కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నాం. ప్రజాశక్తి : ఇరుకైన రోడ్లు విస్తరణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? కమిషనర్‌: చిత్తూరు నగరంలో ప్రధానంగా కట్టమంచి నుండీ కొత్త కలెక్టరేట్‌ వరకు ఉన్న రోడ్డును విస్తరించాల్సి ఉంది. భవన యజమానులతో పలుదఫాలు చర్చలు జరిపాం సహకరించాలని కోరడం జరిగింది. గాంధీ విగ్రహం వద్ద డివైడర్లను ఏర్పాటు చేయడంతో పాలు చేశాం.ప్రజాశక్తి : కార్పొరేషన్‌ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలెలా ఉన్నాయి..? కమిషనర్‌: కార్పొరేషన్‌ పరిధిలో వరదల నుండీ నీవానది సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండేలా నీవానదిలో జేసిబిల ద్వారా శుభ్రం చేయడంతో పాటు లోతును పెంచడం జరిగింది. మురికివాడల్లో సీసీ రోడ్లు వస్తున్నాం. కార్పొరేషన్‌ పరిధిలో చేపట్టే ప్రతి పని టెండర్ల ద్వారా ఖరారు చేయడం జరుగుతోంది.

➡️