మహిళలు ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి

Dec 30,2023 22:15
మహిళలు ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలి

సోషల్‌ సైన్సెస్‌ హ్యూమానిటీస్‌ డీన్‌ ఆచార్య కె.అనురాధ
ప్రజాశక్తి-క్యాంపస్‌: మహిళలు ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ వహించాలని సోషల్‌ సైన్సెస్‌ హ్యూమానిటీస్‌ డీన్‌ ఆచార్య కె.అనురాధ సూచించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉమెన్‌ స్టడీస్‌, న్యాయవిభాగం, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ వుమెన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం ముగిసింది. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారై మాట్లాడారు. మహిళలు శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటే మానసికంగా కూడా బలంగా, దఢంగా సిద్ధమవుచ్చని పేర్కొన్నారు. మహిళలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మహిళా సాధికారత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టాయని వెల్లడించారు. కార్యక్రమంలో సదస్సు కన్వీనర్లు డాక్టర్‌ నీరజ, డాక్టర్‌ ఇందిరా ప్రియదర్శిని, డాక్టర్‌ శ్రీరజిని, ఆచార్య సుజాతమ్మ, ఆచార్య శారద, ఆచార్య సావిత్రి, ఆచార్య సీతాకుమారి, ఆచార్య ఆముదవల్లి, ఆచార్య నిర్మల, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️