మహిళా వర్సిటీలో ముగిసిన జాతీయ సదస్సు

మహిళా వర్సిటీలో ముగిసిన జాతీయ సదస్సు

మహిళా వర్సిటీలో ముగిసిన జాతీయ సదస్సు ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సంగీతం, నత్యం, లలిత కళల విభాగం, కేంద్రీయ సంస్కత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వారి సహకారంతో చేపట్టిన రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం ముగిసింది. సుమారు 32 పత్రాలు సమర్పణ చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ప్రొఫెసర్లు, లెక్చరర్స్‌, పరిశోధకులు విద్యార్థులు , ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ,తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ పత్రాలను ఎంతో చక్కగా సమర్పించారు. ముఖ్య అతిథిగా జాతీయ సంస్కత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జి ఎస్‌ ఆర్‌ కష్ణమూర్తి హాజరయ్యారు. ఈ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌. రజనీ పాల్గొన్నారు. ఇలాంటి సదస్సులు సంస్కతానికి సంగీతంతో అవినాభావ సంబంధం గురించి అందులో ఉండేటువంటి వివిధ కోణాలలో పరిశోధనా దష్టితో జరగాలని ఇటువంటి సదస్సులు ఇంకా జరగాలని ఆకాంక్షించారు. ముగింపు కార్యక్రమంలో కన్వీనర్‌ ఆచార్య శైలేశ్వరి, డాక్టర్‌ యు. హిమబిందు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఈ సదస్సు ఎంతో ఉపయోగకరమని వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య భారతి, రిజిస్ట్రార్‌ ఆచార్య రజనీ తెలిపారు. ప్రముఖ వీణా విద్వాంసురాలు ఆచార్య సరస్వతి వాసుదేవ్‌, ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.

➡️