మహిళా వర్సిటీలో శాస్త్రవేత్తల సహకార ఇంటరాక్టివ్‌ సమావేశం

మహిళా వర్సిటీలో శాస్త్రవేత్తల సహకార ఇంటరాక్టివ్‌ సమావేశం

మహిళా వర్సిటీలో శాస్త్రవేత్తల సహకార ఇంటరాక్టివ్‌ సమావేశంప్రజాశక్తి – క్యాంపస్‌ : జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలతో సహకార ఇంటరాక్టివ్‌ మీట్‌ హైదరాబాద్‌, ఎఎస్పిఐఆర్‌ఈ, డైరెక్టర్‌ ఆచార్య రెడ్డన్న, డాక్టర్‌ చెల్లు ఎస్‌. చెట్టి, రీజెంట్స్‌ విశిష్ట ప్రొఫెసర్‌ ఆఫ్‌ సవన్నా స్టేట్‌ యూనివర్సిటీ, మాజీ రెక్టార్‌ ప్రొఫెసర్‌ భాస్కర్‌, ప్రొ. డి సి రెడ్డి, ఆచార్య కపానిధి, డబ్ల్యూబిఐఎఫ్‌ లో నిర్వహించారు. ఈ సెషన్‌కు అధ్యక్షత వహించిన వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి భారతి డిబిటి ప్రాయోజిత మహిళా బయోటెక్‌ ఇంక్యుబేషన్‌ సదుపాయం, డిఎస్‌టి ప్రాయోజిత టిబిఐ, డిఎస్‌ఐఆర్‌ ప్రాయోజిత టిఒసిఐసి, క్యాంపస్‌లోని ఇతర కేంద్రాల వంటి ఆవిష్కరణ కేంద్రాల ద్వారా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక గమనికను రూపొందించారు. మహిళా బయోటెక్‌ ఇంక్యుబేషన్‌ ఫెసిలిటీలో ఏర్పాటు చేసిన అధునాతన మౌలిక సదుపాయాలను అభినందిస్తూ, ప్రొఫెసర్‌ రెడ్డన్న డాక్టరు సిఎస్‌ చెట్టి ఈ ప్రాంతంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి తిరుపతి కోహార్ట్‌ను స్థాపించడానికి వారి మార్గదర్శకత్వం, మద్దతుకు హామీ ఇచ్చారు. ఆచార్య కళారాణి తన ప్రదర్శన ద్వారా స్టార్టప్‌లు అభివద్ధి చేసిన వినూత్న ఉత్పత్తులను ముందుకు తెచ్చారు. డబ్ల్యూబిఐఎఫ్‌ స్టాఫ్‌, డాక్టరు శిల్పా నయుని, సైంటిఫిక్‌, పరిశోధకులు పాల్గొన్నారు.

➡️