మామిడి ‘పూత’… దిగుబడి ‘కోత’చెట్లల్లో కానరాని పూతలు, పిందెలువిరివిగా రసాయన మందుల పిచికారీఈ’సారి’ కాయలు అంతంతమాత్రమేనా..ధర రెట్టింపు ఉంటుందంటున్న ఆశ

మామిడి 'పూత'... దిగుబడి 'కోత'చెట్లల్లో కానరాని పూతలు, పిందెలువిరివిగా రసాయన మందుల పిచికారీఈ'సారి' కాయలు అంతంతమాత్రమేనా..ధర రెట్టింపు ఉంటుందంటున్న ఆశ

మామిడి ‘పూత’… దిగుబడి ‘కోత’చెట్లల్లో కానరాని పూతలు, పిందెలువిరివిగా రసాయన మందుల పిచికారీఈ’సారి’ కాయలు అంతంతమాత్రమేనా..ధర రెట్టింపు ఉంటుందంటున్న ఆశప్రజాశక్తి – యర్రావారిపాలెం జిల్లాలో మామిడి విస్తారంగా సాగు చేసే ప్రాంతాల్లో యర్రావారిపాలెం మండలం ప్రథమస్థానం. సగానికి పైగా రైతులు మామిడిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యానవన తోటల్లో ఉపాధి హామీ పథకానికి అవకాశం ఇచ్చిన తరువాత మండల వ్యాప్తంగా 9వేల ఎకరాల్లో మామిడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఏటా రాజస్థాన్‌, మహారాష్ట్ర, బెంగుళూరు రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి కోట్లల్లో బిజినెస్‌ చేస్తున్నప్పటికీ ‘సిండికేట్‌’ వల్ల రైతులకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. దీనికితోడు ఈసారి మామిడి పూత అంతంతమాత్రంగానే ఉంది. 30 శాతమే పూత కనిపిస్తుంది. మరోవైపు వైరస్‌ ప్రభావం చెట్లపై ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు అవగాహన కల్పించడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. పూత బాగా రావాలని, వైరస్‌ పోతుందన్న ఆశతో రైతులు పెట్టుబడులు అధికంగా పెడుతూ విరివిగా మందులను పిచికారీ చేస్తుండటం గమనార్హం. వ్యాపారులు ముందస్తుగా ఎకరా 30వేలకు కొనుగోలు చేస్తున్నారు. తోతాపురి టన్ను 10-20వేలు, బంగినపల్లి, బేనీషా, ఇతర రకాలు 20-30వేలు ధర పలుకుతాయన్న ఆశతో రైతులు, వ్యాపారులు ఉన్నారు. సకాలంలో రాని మామిడి పూత ప్రకతి భౌగోళిక పరిస్థితులు అతివష్టి అనావష్టి వల్ల డిసెంబర్‌ ,జనవరి కి పూర్తిగా రావాల్సిన మామిడి పూత దశలవారిగా రావడంతో ముందుగా వచ్చిన మామిడి పూతకు వైరస్‌ సోకడం వల్ల పూర్తిగా రాలిపోతోంది. పూతతో పాటు లేత ఇగురులు ఎక్కువగా రావడంతో మామిడి పూత పూర్తిస్థాయిలో తేనె మంచు వైరస్‌ బారిన పడి మామిడి పిందెలు రాకముందే పూతలు మాడిపోతున్నాయి. పూత దశ నుండి కాయలు కోసే వరకు నాలుగు నుండి ఆరు సార్లు మందులు పిచికారి చేయడం వల్ల రైతులకు ఎకరాకు 15వేల నుండి 20 వేల వరకు ఖర్చులు పెరిగి నష్టాల్లో కూరుకు పోతున్నారు. అధిక దిగుబడి వచ్చిన మామిడి తోటలను కొనుగోలు చేస్తే తప్ప వ్యాపారస్తులకు లాభాలు రావడం లేదు. దీనికి తోడు దళారులు వ్యాపారస్తులను మరింత దెబ్బతీస్తున్నారు. మామిడి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన వ్యాపారులకు మామిడి ఫ్యాక్టరీ యజమానులు సిండికేట్‌ కావడంతో ఆశించిన స్థాయిలో ధర పలకడం లేదు. ఈ సంవత్సరం దిగుబడి తక్కువగా ఉంటుంది కాబట్టి ధర బాగుంటుందని రైతులు ఆశతో ఉన్నారు. అధికారులు పంట నష్టంపై అంచనాలు వేసి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. మామిడికి డిమాండ్‌ పెరగడం లేదు : కాలేషా, మండీ నిర్వాహకుడు, నెరబైలు మామిడి పంట ఆశించిన స్థాయిలో వచ్చినా రాకపోయినా ధర మాత్రం నామమాత్రంగానే ఉంటుంది. కాయలు కోసిన తరువాత మండీ కమీషన్లు, కూలీలు, బాడుగలు తీసేస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. పంటను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు రవాణా చేస్తేనే ధరలు పెరిగి మామిడి రైతులు లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ విధంగా ఎగుమతులపై దృష్టి సారించాలి. మామిడి రైతులను ఆదుకోవాలి : నాగిశెట్టి కుమార్‌, రైతు మామిడి పంటపై ఆధారపడి జీవిస్తున్న రైతులు నష్టాల బారిన పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలి. మామిడి పంట దిగుబడి అధికంగా వచ్చేలా అధికారులు తగు సలహాలు, సూచనలు ఇవ్వాలి. మామిడి పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. అవగాహన కల్పిస్తున్నాం : శివకుమారి, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ మామిడి రైతులకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఏడాది 30శాతం మాత్రమే మామిడి పూత వచ్చింది. ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రైతుకు ఎకరాకు 15వేల నుంచి 20వేల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఏడాది తోతాపురి, నీలం తప్ప బెనిషా మిగతా రకాలు సరిగ్గా పూతలు రావడం లేదు.

➡️