ముగిసిన బాలోత్సవంస్ఫూర్తిదాయకంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ముగిసిన బాలోత్సవంస్ఫూర్తిదాయకంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ముగిసిన బాలోత్సవంస్ఫూర్తిదాయకంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులుప్రజాశక్తి-తిరుపతి సిటీ: పిల్లల సజనాత్మకతను వెలికి తీసేందుకు రోటరీ క్లబ్‌ సౌజన్యంతో తిరుపతి బాలోత్సవ ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల పండగ ఆదివారం ముగిసింది. స్థానిక శ్రీపండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో రెండు రోజులు పాటు నిర్వహించిన పోటీల్లో ఆరు విభాగాల్లో 29 అంశాలలో పోటీలు నిర్వహించారు. చాచా నెహ్రూ వేదిక, అన్నమయ్య వేదిక, గురుజాడ వేదిక, గోపికష్ణ వేదిక, బళ్లారి రాఘవ వేదిక, తదితర వేదికలపై జానపద శాస్త్రీయ నత్య పోటీలతో పాటు ఏకపాత్రాభినయం, దేశభక్తి గీతాలాపన్లు, కోలాటాలు పోటీలను నిర్వహించారు. పోటీలలో విజేతలకు ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు సభలో బహుమతులు అందజేశారు. నడ్డా నారాయణ, టెంకాయల దామోదరం, మల్లారపు నాగార్జున, బండి మధుసూదన్‌ రెడ్డి, రెడ్డప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️