రసాయనశాస్త్రంలో మాధురికి డాక్టరేట్‌

రసాయనశాస్త్రంలో మాధురికి డాక్టరేట్‌

రసాయనశాస్త్రంలో మాధురికి డాక్టరేట్‌ ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర పరిశోధక విద్యార్థి చౌగోని మాధురికి డాక్టరేట్‌ ప్రదానం చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి మూడే దామ్లా నాయక్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రసాయనశాస్త్ర విభాగపు ఆచార్యులు జి మాధవి పర్యవేక్షణలో ”డిజైన్‌ సింధసిస్‌ అండ్‌ క్యారెక్టరైజేషన్‌ ఆఫ్‌ నానో స్ట్రక్చర్ట్‌ మెటీరియల్స్‌ ఆస్‌ ఎలక్ట్రో కెమికల్‌ సెన్సార్‌ ఫర్‌ ద ఎనాలసిస్‌ ఆఫ్‌ బయో మోలిక్యుల్స్‌ అండ్‌ డ్రగ్స్‌’ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని వర్సిటీకి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఇందుకు ఆమెకు రసాయన శాస్త్ర విభాగంలో డాక్టరేట్‌ డిగ్రీని ప్రధానం చేశామని తెలిపారు. సి మాధురి పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని అనేక పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈమె పలు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా జర్నల్స్‌ లలో అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు. మాధురికి డాక్టరేట్‌ రావడం పట్ల రసాయన శాస్త్ర విభాగపు ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధక మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.

➡️