రుణ వసూళ్ల లక్ష్యాలను వేగవంతం చేయాలి : సిఇఒ

రుణ వసూళ్ల లక్ష్యాలను వేగవంతం చేయాలి : సిఇఒ

రుణ వసూళ్ల లక్ష్యాలను వేగవంతం చేయాలి : సిఇఒప్రజాశక్తి – గూడూరు టౌన్‌ సహకార బ్యాంకుల పరిధిలోని సొసైటీలలో రుణ వసూళ్లు లక్ష్యాలను అధికారులు సిబ్బంది వేగవంతం చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ సి ఈ ఓ శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన వింజమూరులో జోనల్‌ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార బ్యాంకుల వారీగా క్షేత్ర స్థాయిలో ప్రత్యేక రివ్యూ చేపట్టారు. రుణ వసూళ్లను త్వరితగతిన పూర్తి చేసి బ్యాంకుల పురోభివద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు తగిన రీతిలో మెరుగైన తోడ్పాటును అందించాలని దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా సహకార నేస్తం డిపాజిట్‌ పథకం కింద 444 రోజులకు గానూ అత్యధికంగా 7.75 పర్సెంట్‌ వడ్డీతో సహా సీనియర్‌ సిటిజన్స్‌ కు 8.25 పర్సెంట్‌ ఇవ్వబడునని, ఈ సదవకాశమును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జి.ఎం సరిత, డి.జి.ఎం లు నాగేంద్ర కుమారి , దయాకర్‌ రెడ్డి , మధు సుధన్‌ , గూడూరు, కోట, వాకాడు, నాయుడుపేట, సుల్లూరు పేట బ్రాంచి మేనేజర్లు పాల్గొన్నారు.

➡️