రూ.3 వేల పెన్షన్‌తో ఆర్థిక భరోసా: మంత్రి

రూ.3 వేల పెన్షన్‌తో ఆర్థిక భరోసా: మంత్రి

రూ.3 వేల పెన్షన్‌తో ఆర్థిక భరోసా: మంత్రిప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌జగన్మోహన్‌ రెడ్డి అర్హులైన నిరుపేదలకు 3వేల రూపా యల పెన్షన్‌ మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని రాష్ట్ర పర్యాట క, సాంస్కతిక వ్యవహారాల, యువజ న సర్వీసుల, క్రీడా శాఖా మంత్రి ఆర్‌కె రోజా పేర్కొన్నారు. పెంచిన పెన్షన్‌ ల పంపిణీని పుత్తూ రు మంలంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్‌కె రోజా మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 2,75,207 మందికి 8,065.58 కోట్ల రూపాయలు, పుత్తూరు మండలానికి 3890 మందికి ఒక కోటి 14లక్షల 60వేల రూపాయలను పెన్షన్స్‌ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు ఎంపీపీ మునివేలమ్మ, వైస్‌ ఎంపీపీలు స్వామి రెడ్డి, విమలమ్మ, ఎంపీడీవో ప్రసాద్‌, తహశీల్దారు పరమేశ్వరస్వామి. వెలుగు ఏపిఎం సుబ్బారెడ్డి, సర్పంచులు గోవింద్‌ స్వామి రెడ్డి, మురళీ మోహన్‌ యాదవ్‌, మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైసిపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️