రేపు ఎపిపిఎస్‌సి గ్రూప్‌ 1 పరీక్ష : కలెక్టర్‌

రేపు ఎపిపిఎస్‌సి గ్రూప్‌ 1 పరీక్ష : కలెక్టర్‌

రేపు ఎపిపిఎస్‌సి గ్రూప్‌ 1 పరీక్ష : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ఈనెల మార్చి 17తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్‌- 1 పరీక్ష కోసం పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని, పరీక్ష నిర్వహణకు సిసి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కి తావు ఉండరాదని జిల్లా కలెక్టర్‌ డా. జి లక్ష్మీ శ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నందు ఈ నెల మార్చి 17 న ఆదివారం జిల్లాలో జరగనున్న గ్రూప్‌-1 పరీక్షల నిర్వహణపై చీఫ్‌ సూపరింటెండెంట్‌ లు, లైజన్‌ అధికారులు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రూప్‌ -1 పరీక్షలు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పేపర్‌ -1, మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పేపర్‌ -2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని అన్నారు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌ లో ఉంటుందని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు.తిరుపతి పట్టణ, రూరల్‌ పరిధిలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 9,377 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, 16 మంది లైజన్‌ ఆఫీసర్‌ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి హాల్‌ టికెట్‌, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడి కార్డ్‌, మొదలైనవి) తీసుకు రావాలన్నారు. గర్భిణీలకు, విభిన్న ప్రతిభావంతులైన అంధులకు గ్రౌండ్‌ ఫ్లోర్‌ నందు పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు లో ఉంటుందన్నారు. జిల్లాలో జరగబోయే ఏపిపిఎస్సి గ్రూప్‌ 1 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఏదేని సమాచారం కొరకు కంట్రోల్‌ రూం నంబర్లను 9000665565, 9676928804 ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ పెంచల కిషోర్‌, ఆర్డీఓ తిరుపతి నిశాంత్‌ రెడ్డి హాజరయ్యారు

➡️