రోజు ఆదాయంలో ఏంత తేడానో..! శ్రీ అంబానీకి రూ.116 కోట్లు.. శ్రీ అంగన్‌వాడీలకు రూ.300లేనా..!

Dec 29,2023 22:55
రోజు ఆదాయంలో ఏంత తేడానో..! శ్రీ అంబానీకి రూ.116 కోట్లు.. శ్రీ అంగన్‌వాడీలకు రూ.300లేనా..!

రోజు ఆదాయంలో ఏంత తేడానో..! శ్రీ అంబానీకి రూ.116 కోట్లు.. శ్రీ అంగన్‌వాడీలకు రూ.300లేనా..!ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, యంత్రాంగం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్‌టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాత మున్సిపల్‌క ఆర్యాలయం నుంచి శ్రీదేవి కాంప్లెక్స్‌, నాలుగు కాళ్ల మండపం మీదుగా ర్యాలీ జరిగింది. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి కె.రాధాక్రిష్ణ మాట్లాడుతూ 18 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 56వేల సెంటర్లు మూత వేసుకుని లక్షా 50వేల మంది మహిళలు రోడ్లపైకొచ్చి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. నాయకులు టి.సుబ్రమణ్యం, పి.బుజ్జి, ఎన్‌డి రవి, నాగరాజమ్మ, గోమతి పాల్గొన్నారు. – పుత్తూరు టౌన్‌లో ‘సిఎం మనస్సు మార్చు ప్రభూ’ అంటూ ఏసుప్రభును ప్రార్థిస్తూ తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్షను కొనసాగించారు. అంగన్‌వాడీ నాయకులు మునికుమారి, విజయకుమారి, హైమావతి, జయంతి పాల్గొన్నారు. – నారాయణవనంలో టిడిపి ఇన్‌ఛార్జి హెలెన్‌ హేమలత సంపూర్ణ మద్దతు తెలిపారు. అంగన్‌వాడీలు పద్మావతి, వాణి, సుశీల నాయకత్వంలో మోకాళ్లపై నిరసన తెలిపారు. – వెంకటగిరి ఐసిడిఎస్‌ ఆఫీసు వద్ద దీక్షకొనసాగింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సంఘీభావం తెలిపారు. ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు ఎ.మంజు, ఎన్‌.స్వరూపరాణి, సుభాషిణి మాట్లాడుతూ అంగన్‌వాడీలకు వేతనాలు పెంచకపోతే ఏం తిని బతకాలని ప్రశ్నించారు. బెదిరించడం మానుకుని డిమాండ్లు పరిష్కరించాలన్నారు. – పిచ్చాటూరులో మండల కార్యదర్శి రామచంద్రారెడ్డి, నాగరాజు, అంగన్‌వాడీలు ఇంద్రాణి, దుర్గా, గ్లోరీ, అముద ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. – నాయుడుపేటలో సిఐటియు నాయకులు శివకవి ముకుంద, అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యదర్శి ఎన్‌.శ్యామలమ్మ ఆధ్వర్యంలో శిబిరం వద్ద గొబ్బెమ్మ పెట్టి దీక్ష కొనసాగించారు. – శ్రీకాళహస్తిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ అంగన్‌వాడీల పోరాటానికి ఎర్రజెండాలు అండగా ఉంటాయన్నారు. రోజుల తరబడి సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదనీ, మహిళలను కష్టపెడుతూ వేడుక చూస్తోందన్నారు. అంబానీ ఒక్కరోజు ఆదాయం రూ.116 కోట్లు, మరి అంగన్‌వాడీలు ఒక్కరోజు కూలి రూ.300లేనా అని ప్రశ్నించారు. అంగన్‌వాడీల సమ్మె 20వ రోజుకు చేరుకుంటున్నా ఏమాత్రం అలుపు సొలుపు లేదనీ, జగన్‌ అంతు చూసేవరకూ నిద్రపోరని స్పష్టంచేశారు. నాయకులు ప్రసాదరావు, అంగేరి పుల్లయ్య, రేవతి, పుష్ప,భారతి, సక్కుభాయమ్మ పాల్గొన్నారు. – గూడూరుటౌన్‌లో నాయకులు ఇంద్రావతి, సురేష్‌ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది. – కోటలో అంగన్‌వాడీలకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మద్దతు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు చేస్తున్న నిరసన కార్యక్రమాలను చూసి ప్రభుత్వానికి వణుకు పుడుతోందన్నారు. రాష్ట్రంలో ఉండే లోపాలను గుర్తు చేస్తూ సిపిఎం జిల్లా అధ్యక్షులు వందవాసి నాగరాజు ఓ పాటను పాడుతూ స్థానిక అంగన్వాడీలను ఉత్సాహపరిచారు. సిఐటియు నాయకులు ముని రాజా, జిల్లా అంగన్వాడి ప్రధాన కార్యదర్శి ఎస్‌.వాణిశ్రీ, ఉపాధ్యక్షులు ముని కుమారి, యుటిఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ టి.భాస్కరరావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి మస్తానయ్య, అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు పద్మలీలమ్మ, సరోజిని, విజయమ్మ పాల్గొన్నారు.

➡️