లింగ నిర్థారణ నేరం

లింగ నిర్థారణ నేరం

లింగ నిర్థారణ నేరం ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : లింగ నిర్ధారణపై రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు తప్ప కుండా పాటించాలని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఎవో మునిలక్ష్మి తెలిపారు. గూడూ రు పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాల యంలో వైద్య, రెవెన్యూ, పోలీస్‌ ఐసిడిఎస్‌ శాఖల అధికారులతో బేటి బచావో.. బేటి పడావో కార్యక్రమంపై సమీక్ష సమావేశం మంగళవార నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎవో ముని లక్ష్మీ మాట్లాడుతూ పై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై తరచూ మీడియాలో వార్తలు రావడం విచారకరమని పేర్కొన్నారు. లింగ నిర్థారణ ప్రక్రియలో భాగంగా మొబైల్‌ స్కానింగ్‌ వినియో గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేక దష్టి చాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్‌ బాబు, నెహ్రూ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️