విద్యుత్తు షాక్‌ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి

విద్యుత్తు షాక్‌ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి

విద్యుత్తు షాక్‌ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలిప్రజాశక్తి-కెవిబిపురం: కెవిబి పురం మండలం లోని ఓళ్లూరు గిరిజ న కాలనీ కి చెందిన సురేష్‌ పనికి వెళుతుండగా పాతపాలెం వ్యవ సాయ భూములలో విద్యుత్‌ షాక్‌ తో మర ణించాడని, అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదు కోవాలని, ప్రమాదా నికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం సత్యవే డు నియో జకవర్గ ఇన్‌ఛార్జి దాసరి జనార్ధన్‌ డిమాండ్‌ చేశారు. బాధితు లతో కలసి ఆదివారం కెవిబి పురం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. ఏఎస్‌ఐ లోకనాథంతో దాసరి జనార్ధన్‌ మాట్లాడుతూ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధిత కుటుంబానికి పరిహారం వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు తమ పంట పొలాల వద్ద విద్యుత్తు తీగ లను వేయడమే నేరమని, ఒక గిరిజన యువకుడు మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా అడవి లో కి తీసుకెళ్లి అతని మృత దేహాన్ని పూడ్చి పెట్టడం దారుణం అన్నా రు. నాగరిక సమాజంలో బతుకుతున్నా ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడడం దారుణ మన్నారు. గిరిజ నుడని నిర్లక్ష్యం చూపడం తగదన్నారు. ఈ సంఘ టనతో ఇద్దరు చిన్న ఆడపిల్లలు వున్న అతని భార్య, అతని తల్లి నిరాశ్ర యు లయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి బాధిత గిరిజన కుటుంబానికి 5 ఎకరాల భూమి, 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️