విద్యుత్‌ షాక్‌తో కూరగాయల వ్యాపారి మృతి

విద్యుత్‌ షాక్‌తో కూరగాయల వ్యాపారి మృతి

విద్యుత్‌ షాక్‌తో కూరగాయల వ్యాపారి మృతిప్రజాశక్తి-ప్రిచ్చాటూరు: పిచ్చాటూరు- శ్రీకాళహస్తి కూడలిలో పార్తిబన్‌ (40) కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం రాత్రి వ్యాపారం మిగించుకుని షాప్‌ షటర్‌ మూయడానికి లాగాడు అయితే వర్షాలకు గోడలు, షటర్‌ నానిఉండటం కరెంటు వైరు షటర్‌కు తగలడంతో పార్తిబన్‌ కరెంట్‌ షాక్‌తో అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గుర్తించి పుత్తూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య శాంతి, కుమారుడు యువరాజు, కుమార్తె లావణ ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

➡️