‘వేడం’లో తాగునీటి తంటాసుదూర ప్రాంతం నుంచి మోతఐదు బోర్లు మరమ్మతులే.

'వేడం'లో తాగునీటి తంటాసుదూర ప్రాంతం నుంచి మోతఐదు బోర్లు మరమ్మతులే.

‘వేడం’లో తాగునీటి తంటాసుదూర ప్రాంతం నుంచి మోతఐదు బోర్లు మరమ్మతులే..ప్రజాశక్తి – శ్రీకాళహస్తి రూరల్‌ వేసవి ప్రారంభం కాకముందే తాగునీటి తంటాలు మొదలయ్యాయి. శ్రీకాళహస్తి రూరల్‌ వేడం పంచాయతీలో బోరు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. వేసవి ప్రారంభమవుతున్నా ముందు జాగ్రత్తగా పాలకులు బోర్లను మరమ్మతులు చేయకపోవడంతో మహిళలకు తిప్పలు తప్పడం లేదు. వేడం పంచాయతీ దళితవాడలో వంద కుటుంబాలున్నాయి. వీరంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు. ఉదయం నిద్ర లేచింది మొదలు కూలి పనులకు వెళితే మరలా తిరిగి సాయంత్రం గూటికి చేరుకుంటారు. వేడం హరిజనవాడలో వాటర్‌ ట్యాంక్‌ ఉన్నప్పటికీ ఆ నీరు ఇంటి అవసరాలకు వాడుకోవడానికి తప్ప దాహం తీర్చుకోవడానికి ఒక చుక్క కూడా పనికిరాదు. దాహం తీర్చుకోవడానికి సుమారు ఆరు బోర్లు ఉన్నప్పటికీ వాటిలో ఒక్క చేతి బోరు తప్ప మిగతా ఐదు బోర్లు మరమ్మతుకు గురై రెండు సంవత్సరాల కాలం అయి ఉంటుందని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తాగునీటి కోసం వేయి లింగాల కోన సమీపంలో ఉన్న ఆశ్రమం దగ్గరకు వెళ్లి నీరు తెచ్చుకుంటేనే కానీ తమకు గొంతు తడవదు అని గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు అధికారులకు తమ గోడును వినిపించినా ఇంతవరకూ ఏ అధికారీ పట్టించుకున్న పాపాన పోలేదు అని వాపోతున్నారు. ఎన్నికల సమయం వచ్చిందంటే మాత్రం ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల వారు వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు కుమ్మరిస్తారు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా తమ సమస్యలను పరిష్కరించే నాధుడు కరువయ్యారని గ్రామ ప్రజలు తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వేడం హరిజనవాడ గ్రామ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.తాగునీటి బోర్లు మరమ్మతులు : ఆర్‌.క్రిష్ణయ్య తాగునీటి బోర్లు ఐదు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో మహిళలు, పిల్లలు, పెద్దలు ఆమడ దూరం వెళ్లి నీరుతెచ్చుకోవాల్సిన దుస్థితి. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవి సమీపిస్తుంది కాబట్టి యుద్ధప్రాతిపదికన బోర్లు మరమ్మతు చేసి ప్రజల దాహార్తి తార్చాలి. మరమ్మతులు చేయిస్తాం : పావని, పంచాయతీ కార్యదర్శి వేడం దళితవాడలో తాగునీటి బోర్లు మరమ్మతుకు గురైన విషయం వాస్తవమే. సర్పంచితో మాట్లాడి మరమ్మతులు చేయిస్తాం. నా దృష్టికి రాలేదు : ఎంపిడిఒ, పటాస్‌రఫీఖాన్‌ తాగునీటి సమస్య నా దృష్టికి రాలేదు. వెంటనే అధికారులతో ఫోన్‌లో చర్చించి రెండు రోజుల్లో బోర్లను మరమ్మతులు చేయిస్తాను. తాగునీటి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను.

➡️