వైద్య రంగంలో ఫార్మాసిస్టులదే కీలక పాత్ర

వైద్య రంగంలో ఫార్మాసిస్టులదే కీలక పాత్ర

వైద్య రంగంలో ఫార్మాసిస్టులదే కీలక పాత్రప్రజాశక్తి -రామచంద్రపురం: వైద్య రంగంలో ఫార్మసిస్టు లదే కీలకపాత్ర అని బెంగళూరుకు చెందిన కపానిధి ఫార్మసీ కాలేజ్‌ అకడ మిక్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎండి కర్వేకర్‌ అన్నారు. సోమవారం మండలం లోని వెంకట్రా మా పురం గ్రామంలోని సెవెన్‌ హిల్స్‌ ఫార్మసీ కాలేజ్‌లో ‘డిజైన్‌ క్రిటికల్‌ థింకింగ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ డిజైన్‌ ఇన్‌ ఆనలిటికల్‌ కెమిస్ట్రీ’ అంశంపై వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వైద్య రంగంలో ఫార్మసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. కోయంబత్తూరుకు చెందిన కే ఎం సి హెచ్‌ ఫార్మసి కాలేజ్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఏ రాజశేఖర్‌ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు ఆత్యాధునిక పరిశోధనలు చేసి నూతన ఔషధాల తయారీపై మక్కువ చూపాలన్నారు. సెవెన్‌ హిల్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం నిరంజన్‌ బాబు మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణల అధ్యయనానికి త్వరగా చూపాలన్నారు. ఫార్మసీ విద్యార్థులు వైద్య రంగంలో అంది వచ్చే ఉపాధి అవకాశాలను సద్విని యోగం చేసు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ ఎం సుమలత, బోధన, బోధ నేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

➡️